Begin typing your search above and press return to search.
చిరకాల కోరికను నెరవేర్చేందుకు సీఎం జగన్ రెడీ?
By: Tupaki Desk | 15 Dec 2020 9:00 PM ISTభీమిలి.. చరిత్రలో ఒక ఘనమైన ఊరు. దేశంలో సూరత్ తరువాత రెండో మున్సిపాలిటీ మన భీమిలియే కావడం విశేషం. విశాఖ జిల్లా భీమునిపట్నం డచ్చివారు మెచ్చిన ప్రాంతంగా ప్రసిద్ధికెక్కింది.. బ్రిటీష్ వారు సైతం నాడు వచ్చి అభివృద్ధి చేసిన ఊరు ఇది. అంతటి భీమిలి పేరు తెరమరుగై విశాఖ విస్తరించింది. కానీ ఇప్పటికీ భీమిలిని గొప్పగా చూడాలన్నది ఇక్కడి వాసుల చిరకాల కోరిక..
దశాబ్ధాలుగా భీమిలి తీరంలో ఒక జెట్టీ కట్టాలన్నది మత్య్సకారుల చిరకాల కోరికగా ఉంది. బ్రిటీష్ పాలకులు ఏలిన రోజుల్లో ఇక్కడి నుంచే షిప్పింగ్ కార్యకలాపాలు సాగేవి అని చెబుతారు. అయితే ఆ తరువాత విశాఖలో పోర్టు ఏర్పాటుతో భీమిలి ప్రాధాన్యత క్రమంగా తగ్గిపోయింది. ఇక రాజకీయ నాయకులు మాత్రం ప్రతి ఎన్నికల్లో భీమిలిలో ‘జెట్టీ’ బ్రిడ్జి నిర్మాణం చేస్తామంటూ ఓట్లు వేయించుకుంటూ పబ్బం గడుపుతారు.
అయితే భీమిలి వాసుల చిరకాల కోరికను నెరవేర్చేందుకు సీఎం జగన్ నడుం బిగించారు. భీమునిపట్నం, నక్కపల్లిలోని రాజయ్యపేటలలో రెండు జెట్టీల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో విశాఖ జిల్లా పూడిమడక వద్ద ఫిషింగ్ హార్బర్ ను కూడా నిర్మాణం చేయాలని ప్రతిపాదించారు. ఇలా భీమిలి వాసులకే కాదు.. మత్య్సకారులకు కూడా జగన్ సర్కార్ వరం ఇచ్చినట్లేనని అనుకుంటున్నారు.