Begin typing your search above and press return to search.

యూటర్న్ కు చంద్రబాబు అంబాసిడరా?

By:  Tupaki Desk   |   7 Aug 2020 2:20 PM IST
యూటర్న్ కు చంద్రబాబు అంబాసిడరా?
X
40 ఇయర్ ఇండస్ట్రీ ఆయన.. దశాబ్ధాలుగా రాజకీయాలను ఏలారు. తనకు అనుకూలంగా ఉంటే సాంతం వాడేస్తారని.. అవసరం తీరాక వదిలించుకుంటాడనే అప్రప్రదను రాజకీయాల్లో మూటగట్టుకున్నారు. అవసరార్థం రాజకీయాలు చేయడంలో చంద్రబాబును మించిన నేత మరొకరు లేరని రాజకీయవర్గాల్లో ప్రచారం ఉంది.

చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో యూటర్న్ లకు అంబాసిడర్ గా మారారు. ఇప్పుడూ దాన్నే కొనసాగిస్తున్నారన్న విమర్శలున్నాయి.. ‘యూటర్న్ బాబూ’గా పేరుపొందారంటారు. గడిచిన ఐదారేళ్ల రాజకీయం చూస్తే.. 2014 వరకు మోడీనే దేవుడన్న చంద్రబాబు.. ఆయన ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మొదట మారు మాట్లాడలేదు. అనక మోసం చేశాడని యూటర్న్ తీసుకొని మోడీతో కటీఫ్ చేశాడు.

ఇక సీబీఐతో టీడీపీ నేతలమీద కేంద్రం దాడులు చేయిస్తే.. సీబీఐని అడుగు పెట్టనీయను అని సీఎంగా చంద్రబాబు నిషేధం విధించాడు. ప్రత్యేక హోదా వద్దు అని ఆనాడు.. ఇప్పుడు కావాలని అని ఇప్పుడు అంటున్నాడు. 40 ఏళ్ల అనుభవంలో చంద్రబాబుకు ఇలాంటి మచ్చలెన్నో పడ్డాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నిజానికి చంద్రబాబు ఎన్నో మంచి పనులు చేసినా ‘యూ టర్న్’ బాబుగానే మిగిలిపోయాడనే విమర్శ రాజకీయవర్గాల్లో నెలకొంది. ప్రతి నిర్ణయంలో చంద్రబాబు యూటర్న్ తీసుకుంటాడంటారు. సీబీఐని అడుగుపెట్టనీయను అన్నాడు.. అధికారం పోగానే సీబీఐ కావాలి అని ఇప్పుడు అంటున్నాడు. 4 ఏళ్లుగా ఏపీకి ప్రత్యే హోదా వద్దు అని చంద్రబాబు అన్నాడు. ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోగానే గత సంవత్సర కాలంగా హోదా కావాలంటూ నినదిస్తున్నాడు. మోడీని సీఎంగా ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు తిట్టాడు. ఇప్పుడు అధికారం పోయిన వేళ పొగుడుతున్నాడు..

ఇలా యూటర్న్ లలో చంద్రబాబును మించిన రాజకీయ నాయకుడు లేడని.. అవసరార్థం రాజకీయాలు చేయడంలో బాబు ఆరితేరాడని పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.