Begin typing your search above and press return to search.

వైద్యానికి కులాన్ని అంటిస్తారా? ‘రమేశ్ చౌదరి’ అనటమేంటి?

By:  Tupaki Desk   |   15 Aug 2020 10:15 AM IST
వైద్యానికి కులాన్ని అంటిస్తారా? ‘రమేశ్ చౌదరి’ అనటమేంటి?
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విజయవాడ స్వర్ణప్యాలెస్ ఉదంతం గురించి తెలిసిందే. విజయవాడలో ప్రముఖ ఆసుపత్రిగా చెప్పే రమేశ్ ఆసుపత్రికి సంబంధించి కోవిడ్ సెంటర్ ను హోటల్ స్వర్ణ నిర్వహించటం తెలిసిందే. గత ఆదివారం.. ఇందులో అగ్నిప్రమాదం చోటు చేసుకోవటం.. చికిత్స పొందుతున్న పలువురు రోగులు మరణించటం తెలిసిందే. దీనికి సంబంధించి చోటుచేసుకుంటున్న పరిణామాలపై తాజాగా రమేశ్ హాస్పిటల్స్ ఎండీ స్పందించారు.

మీడియా మందుకు వచ్చిన ఆయన కొన్ిన వివరణలు ఇచ్చే ప్రయత్నం చేశారు. రమేశ్ ఆసుపత్రికి కోవిడ్ ట్రీట్ మెంట్ అనుమతుల్ని రద్దు చేసిన ఉత్తర్వులపై స్పందించారు. స్వర్ణ ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్ ను కలెక్టర్ కొందరు ఉన్నతాధికారులు రిఫర్ చేశారన్నారు. కలెక్టర్ అనుమతితోనే దాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. హోటల్ హౌస్ కీపింగ్ బాధ్యత హోటల్ యాజమాన్యానిదేనని.. వైద్యం..వైద్య సేవలు మాత్రమే తమకు సంబంధమన్నారు. హోటల్ మేనేజ్ మెంట్ కు సంబంధించి నైట్ డ్యూటీలో ఉన్న వారిని అరెస్టు చేయకుండా.. హాస్పిటల్ సిబ్బందిని అరెస్టు చేయటమేమిటని ప్రశ్నించారు.

డాక్టర్ ఇచ్చే ట్రీట్ మెంట్ కు కులం.. మతం లాంటివి చూడమని.. కానీ కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం రమేశ్ చౌదరి అంటూ మాట్లాడటాన్ని తప్పుపట్టారు. వైద్యం అన్నది కులాన్ని అడ్డం పెట్టుకొని పదవులు.. వ్యాపారాల్ని చేయటం కాదన్నారు. వైద్యానికి కులాన్ని అంటగట్టటం సరికాదంటూ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ తరహా ప్రచారానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది.