Begin typing your search above and press return to search.
కోర్టుల్లో పిల్ వెనుక అధికార పార్టీ ఉందా?
By: Tupaki Desk | 17 Dec 2016 11:53 AM ISTతరచుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యలను(పిల్) దాఖలు చేస్తున్న ఢిల్లీ బిజెపి నేతపై సుప్రీం కోర్టు నిప్పులు కురిపించింది. ''కోర్టుల్లో పార్టీ తరపున రాజకీయ ప్రచారాన్ని నిర్వహించేందుకు బీజేపీ నీకు నిధులు సమకూరుస్తోందా'' అని ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి అశ్విని ఉపాధ్యాయ్ ను సుప్రీం ప్రశ్నించింది. అశ్విని దాఖలు చేసిన పిల్ ను కొట్టేసినట్లు తెలిపింది. ''ఇటీవల కాలంలో నువ్వు తరచూ కోర్టులో వ్యాజ్యాలను దాఖలు చేయడాన్ని గమనిస్తూనే ఉన్నాం. నైపుణ్యమున్న వ్యాజ్యాలు దాఖలు చేసే కార్యకర్తగా మారుతున్నావు. కేంద్రంలో మీ పార్టీనే అధికారంలో ఉంది. మీ సమస్యపై నేరుగా ప్రభుత్వాన్ని సంప్రదించొచ్చు కదా? ఇలా కోర్టులో పిల్ లు దాఖలు చేసి కోర్టు సమయాన్ని ఎందుకు వృథా చేస్తావు?'' అని అశ్వినిని కోర్టు ప్రశ్నించింది.
కోర్టులో ఇలాంటి రాజకీయ ప్రచారానికి అనుమతించమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఇటీవల కాలంలో పిల్ పేరుతో దాఖలవుతున్న వ్యాజ్యాలపై ఉన్నత న్యాయస్థానాలు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి విదితమే. వాటిలో 80 శాతం సొంత ప్రయోజనాలతో దాఖలు చేసినవేనని గతంలో ఓ హైకోర్టు పేర్కొంది. ఈ క్రమంలో తాజాగా సుప్రీంకోర్టు సైతం అదే తరహా వ్యాఖ్యలు చేసింది.
మరోవైపు ప్రభుత్వం రద్దు చేసిన రూ. 500 - రూ. 1000 నోట్ల వినియోగ గడువును పెంచడానికి సుప్రీంకోర్టు తిరస్కరించింది. పెద్ద నోట్ల రద్దుపై వివిధ హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విచారణలో వారానికి రూ. 24 వేలు విత్ డ్రా చేసే గడువును ఎప్పటికి తొలగిస్తారని కేంద్రాన్ని ఐదుగురు జడ్జీలతో కూడిన ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నవంబర్ 11 నుంచి ఈ నెల 14 వరకూ జిల్లా సహకార బ్యాంకుల ద్వారా రూ. 8 వందల కోట్లు సేకరించినట్లు కోర్టుకు అటార్నీ జనరల్ తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/