Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ‘రెడ్డి’ సామాజికవర్గం వద్దా?

By:  Tupaki Desk   |   31 Aug 2020 12:15 PM IST
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ‘రెడ్డి’ సామాజికవర్గం వద్దా?
X
తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అధికారం ఎక్కువగా రెడ్డి సామాజికవర్గం చేతుల్లోనే కొనసాగింది. టీడీపీ పుట్టాక కమ్మ నేతల ఆధిపత్యం సాగింది. రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ లో అయితే రెడ్లదే రాజ్యం. ఇప్పుడు వైసీపీలోనూ రెడ్డిలదే అధికారం హస్తగతమైంది. అయితే ఇప్పుడిప్పుడే ఎదగాలనుకుంటున్న బీజేపీ మాత్రం తెలుగురాష్ట్రాల్లోనే బలమైన ‘రెడ్డి’ సామాజిక వర్గాన్ని పట్టించుకోకపోవడం చర్చనీయాంశమవుతోంది. కాపులకే ప్రాధాన్యం ఇస్తూ ముందుకెళుతోందన్న వాదన వినిపిస్తోంది. వారి ఒక్కరి ఓట్లతో బీజేపీ గెలవడం కష్టమేనన్న భావన వ్యక్తమవుతోంది. బీజేపీ తీరు చూస్తుంటే తెలుగురాష్ట్రాల్లో బీజేపీ ‘రెడ్డి’ సామాజికవర్గం వద్దా అన్న చర్చ కూడా సాగుతోంది.

కేంద్రంలో అధికారం ఉంది. ఫుల్ పవర్ చేతిలో ఉన్నాయి. దీంతో రాష్ట్రాలన్నీ ప్రాంతీయ పార్టీలను ఓ ఆట ఆడేస్తోంది బీజేపీ. ఇప్పటికే రాష్ట్రాల ఆదాయం, హక్కులన్నింటిని ఒక్కటొక్కటిగా తీసుకుంటోంది. ఈ క్రమంలోనే రెండడు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేసుకోవాలని కేంద్రంలోని బీజేపీ రాష్ట్రాల బాధ్యుతలకు స్పష్టం చేసింది. కొత్త అధ్యక్షులను రెండు తెలుగు రాష్ట్రాలకు నియమించి ఫుల్ పవర్స్ ఇచ్చింది. అయితే ఎందుకో ఇద్దరు బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ మరియు సోము వీర్రాజులు ఆ మాదిరిగా ముందుకు వెళ్లడం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి.

ఎందుకంటే.. తెలంగాణలో పెద్ద ఎత్తున పొలిటికల్ గ్యాప్ ఉన్నందంట.. తెలంగాణలో బలమైన సామాజికవర్గం రెడ్డిలు ఇప్పుడు ఎటు పోవాలో అర్థం కాక కాంగ్రెస్ లో ఉన్న గ్రూపుల వలన మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందో రాదో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రెడ్డి నేతలంతా ఈ విషయంలో తర్జనభర్జన పడుతుంటే తెలంగాణ బీజేపీ సంశయంలో ఉన్న వారిని ఆకర్షించే ఏ ప్రయత్నాలు చేయడం లేదంట..

అదే విధంగా ఏపీలో కొత్తగా వచ్చిన సోము వీర్రాజు కూడా అలానే ఉంటున్నాడు. సోము వీర్రాజు ఢిల్లీ వెళ్లి వచ్చిన తరువాత నేరుగా కాంగ్రెస్ లో పార్టీలో ఉన్నాడో లేదో తెలియని చిరంజీవి మరియు జనసేన అధ్యక్షుడైన పవన్ కళ్యాన్ ను కలిశాడు. వాళ్ల ఇద్దరూ కాపు సామాజికవర్గం కాబట్టి కలిశాడని.. అందుకే రెడ్డి సామాజికవర్గం వాళ్లు బీజేపీలోకి వెళ్లడానికి సంశయిస్తున్నారట.. సోము వీర్రాజు కాపులకే ప్రాధాన్యం ఇస్తున్నాడని తెలిసి బీజేపీలోకి రెడ్లు రాలేకపోతున్నారని విశ్లేషకులు అంటున్నారు.

మరి ముందుముందు రెడ్లను బీజేపీ ఆకర్షిస్తుందా? లేక కొన్ని సీట్లే వారికి చాలు అని పక్కనపెడుతుందా అనేది వేచిచూడాలి. ఇప్పుడు ఇదే చర్చ ఆ పార్టీలో ఉన్న నేతల్లో విస్తృతంగా సాగుతోంది.