Begin typing your search above and press return to search.

బండి తొందరపడ్డారా?

By:  Tupaki Desk   |   28 July 2022 5:28 AM GMT
బండి తొందరపడ్డారా?
X
తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్ తొందరపడినట్లే ఉన్నారు. నల్గొండజిల్లా మునుగోడు కాంగ్రెస్ ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వ్యవహారంపై తొందరపడ్డారు. విషయం ఏమిటంటే రాజగోపాలరెడ్డి చేరికవల్ల బీజేపీ బలపడుతుందని చెప్పారు.

తొందరలోనే రాజగోపాలరెడ్డి తమ పార్టీలో చేరే అవకాశముందన్నారు. నిజానికి ఏ పార్టీ అధినేత కూడా ఇలాగ చెప్పారు. పక్క పార్టీ నుండి ఫలానా నేత చేరుతారని, ఆయన చేరితో తమ పార్టీ బాగా బలోపేతమవుతుందని ప్రకటించారు.

ఎందుకంటే బండి చెప్పినట్లుగా కోమటిరెడ్డి బీజేపీలో చేరితే సరి. అదే కాంగ్రెస్ లోనే ఉండాలని అనుకుంటే అప్పుడు బండి పరిస్ధితి ఏమిటి ? పార్టీ నుండి బయటకు వెళ్ళిపోతున్నట్లు ఇప్పటికి రాజగోపాలరెడ్డి చాలాసార్లే చెప్పారు. అయితే వివిధ కారణాల వల్ల ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఇపుడైతే ఈరోజో రేపే రాజీనామా చేయటం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో కోమటిరెడ్డిని పార్టీలోనే కంటిన్యు అయ్యేట్లుగా అధిష్టానం కూడా బుజ్జగింపులు మొదలుపెట్టింది.

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క లాంటి నేతలు కోమటిరెడ్డితో భేటీ అయ్యారు. వాళ్ళమధ్య చర్చలు ఏమి జరిగిందో బయటకు తెలీదు కానీ రాజగోపాల్ పార్టీలోనే కంటిన్యు అవుతారని బట్టి మీడియాతో చెప్పారు.

ఒకవేళ బుజ్జగింపులు వర్కవుటై రాజగోపాల్ కాంగ్రెస్ లోనే కంటిన్యు అవ్వాలని డిసైడ్ అయితే బండి సంజయ్ పరువంతా పోయినట్లే. రాజగోపాల్ కాంగ్రెస్ కు రాజీనామాచేసి బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించేలోపు ఏమన్నా జరగవచ్చు.

ఇదే సమయంలో రాజగోపాల్ పార్టీలో చేరికవల్ల బీజేపీ బలోపేతమవుతుందన్నారు. అంటే రాజగోపాల్ చేరకపోతే బీజేపీ నల్గొండజిల్లాలో బలహీనంగా ఉన్నట్లు తనంతట తానుగానే బండి చెప్పుకున్నట్లయ్యింది. కేసీయర్ పాలనతో జనాలంతా విసిగిపోయారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అధికారంలోకి రాబోయేది తామే అనే పడికట్టు మాటలను ఎవరు పట్టించుకోవటంలేదు. రాజగోపాల్ చేరిక విషయంలోనే బండి తొందరపడినట్లున్నారనిపిస్తోంది.