Begin typing your search above and press return to search.

జాతీయ స్థాయిలో బాబు ప‌రువు పోతోందా ? సీనియ‌ర్ల అంత‌ర్మ‌థ‌నం..!

By:  Tupaki Desk   |   4 April 2021 10:10 AM IST
జాతీయ స్థాయిలో బాబు ప‌రువు పోతోందా ?  సీనియ‌ర్ల అంత‌ర్మ‌థ‌నం..!
X
టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ్య‌వ‌హారం.. రాష్ట్రంలోనే కాదు.. ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చ‌ర్చ‌కు వ‌స్తోం ది. ఒక‌ప్పుడు.. కేంద్రంలో చ‌క్రం తిప్పాన‌ని.. ప్ర‌ధాన మంత్రుల‌ను ఎన్నుకోవ‌డంలోనూ కీల‌క పాత్ర పోషించా న‌ని ప‌దే ప‌దే చెప్పుకొన్న చంద్ర‌బాబుకు ఇప్పుడు ప‌రిస్థితి ఏమీ బాగున్న‌ట్టు క‌నిపించ‌డం లేద‌ని అంటు న్నారు పార్టీలో సీనియ‌ర్లు. గ‌తం సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ఇటీవ‌ల రెండేళ్ల కింద‌టి వ‌ర‌కు కూడా అధికారంలో ఉన్న చంద్ర‌బాబు.. ఢిల్లీ, బెంగాల్‌, పంజాబ్‌, జ‌మ్ము క‌శ్మీర్ రాష్ట్రాల రాజ‌కీయాల్లోనూ త‌న‌దైన పాత్ర పోషించారు. ముఖ్యంగా ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్‌తోను, బెంగాల్ సీఎం మ‌మ‌తతోనూ బాబు క్లోజ్‌గా ప‌నిచేశారు.

బెంగాల్‌లో త‌లెత్తిన శారదా చిట్‌ఫండ్ కుంభ‌కోణానికి సంబంధించి కేంద్రం సీబీఐ దాడులు చేయించిన ‌ప్పుడు నేరుగా అక్క‌డ‌కు వెళ్లి బెంగాల్ సీఎం మ‌మ‌త‌కు మ‌ద్ద‌తుగా వ్య‌వ‌హ‌రించారు. ఆమెతో క‌లిసి రోడ్డుపై భైటాయించి మ‌రీ.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి వ్య‌తిరేకంగా దూకుడు ప్ర‌ద‌ర్శించారు. ఇక‌, ఢిల్లీ సీఎం విష‌యంలోనూ కేంద్రం చూపిస్తున్న దూకుడును అడ్డుకునేందుకు ఏపీ సీఎంగా చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేసి.. కేజ్రీవాల్‌కు అండ‌గా నిల‌బ‌డ్డారు. అయితే.. అలాంటి చంద్ర‌బాబుకు ఇప్పుడు అదే రాష్ట్రాల నుంచి అదే జాతీయ‌స్థాయి నేత‌ల నుంచి ఆద‌ర‌ణ కొర‌వ‌డింది. ప‌రిస్థితులు అలానే ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఒంటెత్తు పోక‌డ‌ల‌పై ఈ సీఎంలు యుద్ధం చేస్తున్న‌ప్ప‌టికీ.. బాబును మాత్రం ప‌క్క‌న పెట్టేశారు.

ఇటీవ‌ల‌.. బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ దూకుడుకు అడ్డుక‌ట్ట వేయాల‌ని పిలుపునిచ్చారు. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం ఉన్న నాయ‌కులు క‌లిసి రావాల‌ని ఆమె కోరారు. అంతేకాదు.. ఏకంగా ఆమె.. కేంద్రంపైఎందుకు పోరాడాలో పేర్కొంటూ.. దేశ‌వ్యాప్తంగా బీజేపీని వ్య‌తిరేకిస్తున్న వారికి, రాష్ట్రాల్లో చ‌క్రం తిప్పుతున్న సీఎంలు, మాజీసీఎంల‌కు కూడా మ‌మ‌త లేఖ‌లు రాశారు. వీటిని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు కూడా పంపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీసీఎం జ‌గ‌న్‌ల‌కు సైతం మ‌మ‌త లేఖ‌లు రాసి.. మోడీపై సాగించే పోరులో క‌లిసిరావాల‌ని.. రాష్ట్రాల హ‌క్కుల‌ను కాపాడుకుం దామ‌ని పిలుపునిచ్చారు.

అయితే.. ఈ క్ర‌మంలో ఒక‌నాడు త‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచి, త‌న కోసం.. కోల్‌క‌తా రోడ్ల‌పై బైఠాయించిన చంద్ర‌బాబును మాత్రం ఆమె విస్మ‌రించారు. బాబుకు ఎలాంటి లేఖా పంప‌లేదు. అదేవిధంగా కేజ్రీవాల్ సైతం బాబుకు ఫోన్ చేయ‌డం మానేశారు. జ‌మ్ము క‌శ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి ఫ‌రూక్ అబ్దుల్లా కూడా యూట‌ర్న్ తీసుకున్నారు. ఇలా.. మొత్తానికి చంద్ర‌బాబును జాతీయ నేత‌లు ప‌క్క‌న పెట్ట‌డంపై టీడీపీ సీనియ‌ర్లు అంత‌ర్మ‌థ‌నం చెందుతుండ‌డం గ‌మ‌నార్హం. ఏపీలో ఎదురైన ఘోర‌ ప‌రాజ‌య‌మే.. జాతీయ‌స్థాయిలో చంద్ర‌బాబు హ‌వాకు మ‌చ్చ‌లు వ‌చ్చేలా చేసిందా ? అనే కోణంలో ఈ చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

ఇక ఇటీవ‌ల స్థానిక ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవ‌డం.. జ‌గ‌న్ దూకుడు... ఇప్పుడు ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల‌ను ఏకంగా బ‌హిష్క‌రించ‌డం వంటివి జాతీయ స్థాయిలో ఓ వెలుగు వెలిగిన బాబు క్రేజ్‌ను డౌన్ చేసేశాయ‌న్న విశ్లేష‌ణ‌లే ఇప్పుడు జోరుగా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.