Begin typing your search above and press return to search.
లెక్కలు చెబుతున్న నిజాలు..ఏపీలోని వారంతా పేదలేనా?
By: Tupaki Desk | 31 Aug 2020 11:15 AM ISTదేశంలో మరే రాష్ట్రంలోనూ కనిపించని సిత్రాలు ఏపీలో కనిపిస్తున్నాయి. ఆర్థికంగా బడుగు జీవులకు ఇచ్చే రేషన్ కార్డులు ఏపీలో ఎంత భారీగా ఉన్నాయో చూస్తే.. నోట మాట రాదంతే. ప్రజాసాధికార సర్వే ప్రకారం నవ్యాంధ్రలో మొత్తం కుటుంబాల సంఖ్య అక్షరాల 1.52 కోట్లు. మరి.. వైట్ రేషన్ కార్డుల సంఖ్య ఎంతో తెలుసా? 1.5కోట్లు. అంటే.. ప్రభుత్వం అందించే బియ్యం లాంటి వాటిని పొందని కుటుంబాలు కేవలం 2 లక్షల కుటుంబాలేనా? అన్నది ప్రశ్న.
ఈ లెక్కన చూస్తే.. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు.. వ్యాపారులు.. రాజకీయ నేతలు.. ఇలా చెప్పుకుంటే సంపన్నులైన వారెందరో కనిపిస్తారు. కానీ.. కక్కుర్తితో వైట్ రేషన్ కార్డు కోసం పడే తపన చూస్తే.. అక్రమంగా కార్డులకు దరఖాస్తు చేసుకుంటున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. విభజన నేపథ్యంలో ఏపీ ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నా.. రాష్ట్ర ప్రజలంతా సంపన్నులుగా అభివర్ణిస్తారు. అలాంటి రాష్ట్రంలో పేద కుటుంబాలకు ఇచ్చే రేషన్ కార్డులు మరీ.. ఇంత భారీగా ఉండటమా? అన్న విస్మయం వ్యక్తమవుతోంది.
చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలు 1.47 కోట్లు ఉంటే.. జగన్ ముఖ్యమంత్రి అయిన ఏడాదిలోనే ఇవి కాస్తా 1.5కోట్లకు పెరిగాయి. అంటే.. జగన్ ప్రభుత్వంలో 30 లక్షల పేద కుటుంబాలు అదనంగా తయారైనట్లు చెప్పాలి. కుటుంబ సభ్యుల్ని ప్రామాణికంగా తీసుకుంటే 95 శాతం మంది రేషన్ పరిధిలో ఉంటే.. కేవలం ఐదు శాతం మంది మాత్రమే దారిద్ర్యరేఖకు ఎగువన ఉన్నట్లుగా అంకెలు స్పష్టం చేస్తున్నాయి.
రాష్ట్రంలో పేదరికం తగ్గిపోతుందని జగన్ సర్కారు చెబుతోంది. అదంతా నిజమనే అనుకుందాం. మరి.. అలాంటి వేళలో.. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి ఇచ్చే రేషన్ కార్డులు ఎందుకింత భారీగా మంజూరు చేస్తున్నారన్నది అసలు ప్రశ్న. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రాష్ట్ర ఖజానాకు దెబ్బేస్తున్న వేళ.. ఇంత భారీగా అనర్హులకు రేషన్ కార్డులు ఇవ్వటం ఏ మాత్రం మంచిది కాదంటున్నారు. అయినా.. ఏపీలాంటి సంపన్న రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఎందుకు చోటు చేసుకుంటున్నట్లు?