Begin typing your search above and press return to search.

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీ

By:  Tupaki Desk   |   15 Feb 2022 3:46 PM IST
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీ
X
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీ అయ్యారు. సవాంగ్ స్థానంలో ఇంటెలిజెన్స్ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని అధికారికంగా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేసింది. రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు.

రాజేంద్రనాథ్ రెడ్డి స్వస్థలం కడప జిల్లా రాజుపాళెం మండలం పర్లపాడు. కొన్నేళ్ల క్రితం ఆయన కుటుంబం హైదరాబాద్ లో స్థిరపడింది. రాజేంద్రనాథ్ రెడ్డి 1992 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి.

గతంలో కసిరెడ్డి విశాఖపట్నం, విజయవాడ పోలీస్ కమిషనర్ గా రాజేంద్రనాథ్ రెడ్డి పనిచేశారు. ఔషధ నియంత్రణ విభాగం అధికారిగానూ ఆయన సేవలందించారు. మరోవైపు తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకూ జీఏడీలో రిపోర్టు చేయాలని గౌతం సవాంగ్ ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేవించింది. కాగా 2023 జులై వరకూ సవాంగ్ పదవీకాలం ఉన్నప్పటికీ ఈలోపే బదిలీ చేయడం చర్చనీయాంశమైంది.

ఉద్యోగులు ఇటీవల నిర్వహించిన ‘చలో విజయవాడ’ కార్యక్రమం విజయవంతం కావడం పోలీసుల వైఫల్యంగానే జగన్ సర్కార్ భావిస్తోంది. లక్షలాది మంది ఉద్యోగులు విజయవాడకు చేరుకొని తమ బాలాన్ని ప్రదర్శించడం ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు. పోలీసుల వైఫల్యమే దీనికి కారణమని ప్రభుత్వం భావిస్తోంది. భారీగా తరలివచ్చిన ఉద్యోగులను నిలువరించడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రభుత్వం భావించింది.

ఈ నేపథ్యంలోనే డీజీపీ సవాంగ్ ను బదిలీ చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు సమాచారం. ఈ బదిలీకి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడడంతో నిర్ధారణ అయ్యింది.ఈరోజు సీఎం జగన్ ను చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ కలిశారు. ఆ తర్వాత డీజీపీ బదిలీ జరిగింది.