Begin typing your search above and press return to search.

డ్రగ్స్ తీసుకునే వారిని వేటాడుతున్న సమీర్ వాంఖేడే.. ఎవరీయన?

By:  Tupaki Desk   |   6 Oct 2021 4:26 AM GMT
డ్రగ్స్ తీసుకునే వారిని వేటాడుతున్న సమీర్ వాంఖేడే.. ఎవరీయన?
X
పోలీస్ సింగం గురించి సినిమాల్లోనే కాదు.. నిజజీవితంలోనూ చూసి ఉంటాం.. కానీ వారు తారసపడేది చాలా తక్కువ. పోలీస్ ఆఫీసర్స్ గా హీరోలు చాలా మంది చేసినా వారికి స్ఫూర్తి నింపేది నిజమైన ఐపీఎస్ లే. అలాంటి స్టిక్ట్ ఆఫీసర్ తెలంగాణలో సజ్జనార్ కాగా.. ఇక ముంబైలోనూ ఓ కత్తిలాంటి ఐఆర్ఎస్ ఉన్నాడు. ఆయనే ‘సమీర్ వాంఖేడే’. ఈ ఐఆర్ఎస్ అధికారి ఇప్పుడు డ్రగ్స్ తీసుకునే వారిని వేటాడుతున్నారు. ఎంతటి ప్రముఖులైనా సరే కటకటాల పాలు చేస్తున్నారు. సినిమా హీరోలను సైతం డ్రగ్స్ కేసుల్లో బుక్ చేస్తూ వారికి సింహస్వప్నంగా మారాడు. ముఖ్యంగా బాలీవుడ్ సినీ సెలబ్రెటీలు ఈయన పేరు చెబితేనే హడలిపోతున్న పరిస్థితి నెలకొంది.

నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఆఫీసర్ సమీర్ వాంఖేడే తాజాగా వార్తల్లో నిలిచారు. ఈ 40ఏళ్ల అధికారి షారుఖ్ తనయుడిని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశాడు. అయితే ఆయన బాలీవుడ్ కు కొత్తేం కాదు.. గతంలో చాలా సార్లు స్టార్లకు ఈ డ్రగ్స్ కేసుల్లో చుక్కలు చూపించాడు.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ మాఫియా కోణం కూడా బయటపెట్టింది సమీర్ వాంఖడేనే.. ఈ కేసును సీరియస్ గా డీల్ చేశాడు. డ్రగ్స్ మాఫియా కూడా ఆక్ష్న మీద దాడులు చేసేంతగా చేశారు. 2020 నవంబర్ లో సమీర్ మీద.. ఎన్సీబీ అధికారుల మీద భౌతిక దాడి కూడా జరిగి సమీర్ గాయపడ్డాడు. దాడులు జరిగినా వెనక్కి తగ్గకుండా సమీర్ ‘సింగం’లా నిలబడుతున్నాడు. ముంబైలో డ్రగ్స్ మూలాలు బయటపెడుతూ రెండేళ్లలో వేలమందిని పట్టుకున్నారు. మొత్తంగా 17వేల కోట్ల రూపాయల అక్రమ మత్తు పదార్థాలను ఇప్పటివరకూ సీజ్ చేశారు.

సెలబ్రెటీ ఇప్పుడు సమీర్ పేరు చెబితేనే వణికిపోతున్నారు. ఆయన ఏకంగా 2వేల మంది ప్రముఖుల మీద కేసు పెట్టారంటే ఎలాంటి ‘సింగం’ ఆఫీసరో అర్థం చేసుకోవచ్చు.ఆయా సెలబ్రెటీలంతా తగినంత డబ్బు చెల్లించాకే విదేశాల నుంచి తెచ్చిన తమ విలువైన వస్తువులను ఇళ్లకు తీసుకెళ్లారట.. సమీర్ వాంఖడే హిట్ లిస్ట్ లో చాలామంది బాంబే బాబులు ఉన్నప్పటికీ.. మీకా సింగ్, అనురాగ్ కశ్యప్ , వివేక్ ఒబెరాయ్ ఇలా కొంత మంది పేర్లు చెప్పుకోవచ్చు.. మన రాంగోపాల్ వర్మ ఆస్తులపై ఆ మధ్య ఈయన దాడులు చేసి కేసులు పెట్టించారట..

2017లో సమీర్ కూడా ఒక హీరోయిన్ నే పెళ్లి చేసుకోవడం విశేషం. సినిమా వాళ్లతో నిత్యం వైరం పెంచుకునే సమీర్ క్రాంతి రెడ్కర్ అనే మరాఠీ నటిని పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం సాఫీగా సంసారం చేస్తున్నారు.