Begin typing your search above and press return to search.

ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఎవరంటే..

By:  Tupaki Desk   |   30 Jan 2017 7:25 AM GMT
ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఎవరంటే..
X
కొత్త ఏడాది వస్తుంటే.. ఆ ఏడాదికి కొత్తగా అవతరించే మిస్ యూనివర్స్.. మిస్ వరల్డ్ పోటీల మీద విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంటుంది. ఈసారి జరిగిన మిస్ యూనివర్స్ పోటీలో ఒకప్రత్యేకత ఉంది. మన దేశానికి చెందిన మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్.. ఈ పోటీల్లో జడ్జిల ప్యానల్ లో ఒకరిగా వ్యవహరించారు.

ఫిలిఫ్పైన్స్ లో జరిగిన మిస్ యూనివర్స్ ఫైనల్స్ లో ఫ్రాన్స్ భామ.. 23 ఏళ్ల ఇరిన్ మిట్టెనరీ ఈ ఏడాది టైటిల్ ను సొంతం చేసుకున్నారు. దీంతో.. గత ఏడాది విశ్వసుందరిగా ఎంపికైన ఫిలిఫ్పైన్ భామ పియా వుట్జ్ బెక్ తన కిరీటాన్ని ఇరిన్ కు అలంకరించారు. తొలి రన్నరప్ గా మిస్ హైతి రక్వెల్ పెలిస్సైర్ నిలువగా.. రెండో రన్నరప్ గా మిస్ కొలంబియా నిలిచింది.

మీరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నది ఏమిటో అర్థమైంది. అక్కడికే వస్తున్నాం. మరీ పోటీల్లో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించిన రోహ్మిత హరిమూర్తి సంగతి చూస్తే.. ఈ పోటీలో ఆమె చాలా వెనుకపడిపోయారు. ఆమె 13వ స్థానానికి పరిమితమయ్యారు. ఇక.. తాజా విశ్వసుందరి డిటైల్స్ లోకి వెళితే.. ఫ్రాన్స్ ఉత్తర ప్రాంతంలోని లిల్లే పట్టణంలో ఇరిన్ పుట్టారు. డెంటల్ సర్జరీలో డిగ్రీ చేసిన ఆమెకు స్పోర్ట్స్ అన్నా.. జర్నీ చేయటమన్నా చాలా ఇష్టమట. వీటితోపాటు ఫ్రెంచ్ వంటకాలు చేయటం కూడా చా ఇష్టమట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/