Begin typing your search above and press return to search.
టెస్టులకు కెప్టెన్ గా హిట్ మ్యానే బెస్టు.. మాజీ ఆల్ రౌండర్ వ్యాఖ్యలు
By: Tupaki Desk | 10 Nov 2020 5:40 PM ISTఐపీఎల్ ముగిసిన వెంటనే టీమిండియా నవంబర్ 27 నుంచి ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్ మూడు ట్వంటీ మ్యాచులు, మూడు వన్డేలు, నాలుగు టెస్ట్ మ్యాచులు ఆడనుంది. అయితే వన్ డే, ట్వంటీ ఫార్మాట్లకు కెప్టెన్ గా కొనసాగే కోహ్లీ టెస్ట్ లకు అందుబాటులో ఉండడు. కేవలం ఒక టెస్ట్ మాత్రమే ఆడతాడు. ఆ మ్యాచ్ ముగిసిన అనంతరం పితృత్వ సెలవుల కోసం ఇండియాకి తిరిగి వచ్చేస్తాడు. జనవరి నెలలో విరాట్ భార్య అనుష్క శర్మ కాన్పు కానుంది. ఆ సమయంలో భార్య పక్కన ఉండాలని కోహ్లీ కోరిన కోరిక మేరకు బీసీసీఐ అందుకు అంగీకరించింది.
అతడు మొదటి మ్యాచ్ ఆడిన తర్వాత ఇండియాకి బయలుదేరతాడు. అయితే మిగిలిన మూడు మ్యాచ్ లకు కెప్టెన్ గా వైస్ కెప్టెన్ గా ఉన్న అజింక్యా రహనేను కెప్టెన్ గా నియమిస్తారనే వార్తలు వస్తున్నాయి. దీనిపై మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. టెస్టులకు రహానే కంటే రోహిత్ శర్మనే కెప్టెన్ గా బెటరని సూచించాడు. రోహిత్ ఇప్పటికే ఐపీఎల్లో కెప్టెన్గా తనేంటో నిరూపించుకున్నాడని, అనుభవం ఉన్న వ్యక్తిగా టెస్టులకు అతని సారధ్యమే మేలని పేర్కొన్నాడు. రహానే ను వద్దు అనడానికి పెద్దగా కారణాలు లేవు కానీ.. రోహిత్ అయితేనే బాగుంటుందని తెలిపాడు.
కోహ్లీ పితృత్వ సెలవులపై విమర్శలు
సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనలో వన్డేలు, ట్వంటీల తరువాత ఒక టెస్ట్ మ్యాచ్ కే కోహ్లీ అందుబాటులో ఉండి ఆ తర్వాత పితృత్వ సెలవులపై ఇండియాకు వస్తుండడంతో అతడిపై అభిమానులు విమర్శలు చేస్తున్నారు. ధోని కెప్టెన్ గా ఉన్న సమయంలో జీవా పుట్టగా ఆ సమయంలో విదేశీ పర్యటనలో ఉన్న ధోనీ.. మ్యాచ్ లు ముగిసిన తర్వాతే ఇంటికొచ్చి బిడ్డను చూసుకున్నాడని.. ఇప్పుడు కోహ్లీ అర్ధాంతరంగా సిరీస్ నుంచి వెనక్కి రావడం బాగోలేదని క్రికెట్ అభిమానులు విమర్శలు చేస్తున్నారు.
టెస్టులకు రోహిత్ ఎంపిక
ఆస్ట్రేలియా టూర్ కు రోహిత్ శర్మను ఎంపిక చేయకపోవడంతో పెద్ద దుమారమే చెలరేగింది. రోహిత్ కు గాయం కావడం వల్లే అతడిని ఎంపికకు పరిగణనలోకి తీసుకోలేదని సెలెక్టర్లు చెప్పినా.. దాని గురించి ముందే క్లారిటీ ఇవ్వాల్సిందని అభిమానులు, మాజీ క్రికెటర్లు పలువురు విమర్శించారు. ఈ నేపథ్యంలో మరోసారి సమావేశమైన సునీల్ జోషీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఫిజియో ఇచ్చిన నివేదికల్లో మార్పులు చేసింది. గాయం నుంచి కోలుకున్న వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు టీ20, వన్డేలకు విశ్రాంతినిచ్చి టెస్ట్ జట్టులో చోటు కల్పించింది. బీసీసీఐ మెడికల్ టీమ్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌ను పర్యవేక్షిస్తుందని, పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించాలనే ఉద్దేశంతోనే వన్డే, టీ20లకు విశ్రాంతి ఇచ్చినట్లు బీసీసీఐ అధికారులు తెలిపారు.