Begin typing your search above and press return to search.

ఫిల్మ్ ఫెస్టివల్ కు జుట్టు కత్తిరించి పంపిన ఇరాన్ మహిళ.. ఎందుకంటే?

By:  Tupaki Desk   |   14 Dec 2022 4:58 AM GMT
ఫిల్మ్ ఫెస్టివల్ కు జుట్టు కత్తిరించి పంపిన ఇరాన్ మహిళ.. ఎందుకంటే?
X
ప్రపంచవ్యాప్తంగా ముస్లిం దేశాల్లోని మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని దేశాలు మినహా అన్ని దేశాల్లో మత చాందసవాదుల కబంధ హస్తాల్లో మహిళలు ఇరుక్కు పోతున్నారు. ఆప్ఘాన్.. ఇరాన్.. సౌదీ లాంటి దేశాల్లో అయితే మహిళల పరిస్థితి దారుణంగా మారిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఆయా దేశాల్లో ఆంక్షల పేరుతో మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తుండటం చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా ఇరాన్ కు చెందిన మహిళా నిర్మాత మహారాజ్ మొహమ్మదీ కేరళలో జరిగిన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ కు తన జుట్టును పంపించి దేశంలో తమ పరిస్థితి ఎలా ఉందో ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశారు.

ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇరాన్ లోని చట్టాల ప్రకారం మహిళలు తప్పనిసరిగా హిజాబ్ ధరించాలి. అయితే హిజాబ్ ను ఉల్లంఘించిందనే కారణంతో తెహ్రాన్ లోని మొరాలిటీ పోలీసులు అమినీ అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల నిర్బంధం కారణంగా ఆ మహిళ సృహ కోల్పోయింది. మూడుర్రోజులు కోమాలో ఉండి మరణించింది.

ఆమె మరణంతో ఇరాన్ లో హిజాబ్ కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసనలు మొదలయ్యాయి. నాటి నుంచి మహిళలు హిబాజ్ ను తగలబెడుతున్నారు. ఈ నిరసనలకు సంఘీభావంగా ప్రపంచవ్యాప్తంగా పలువురు మహిళలు తమ జట్టును కత్తిరించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఈ నిరసనలకు మహిళా నిర్మాత మొహమ్మదీ మద్దతు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆమె గత రెండు దశాబ్దాలుగా మహిళల హక్కుల కోసం తీవ్రంగా పోరాడుతున్నారు. 2003లో ఆమె తీసిన ఉమెన్ వితౌట్ షాడోస్ డాక్యుమెంటరీ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఎన్నో అవార్డులను దక్కించుకుంది. ఈ డాక్యుమెంటరీలో నివాసం లేని.. ఎలాంటి రక్షణ లేని మహిళల జీవితాలను చూపించారు.

2019లో ఆమె తీసిన ఫీచర్ ఫిల్మ్ సన్ మదర్.. 44వ టొరంటో అంతర్జాతీయ చిత్ర ఉత్సవాల్లో ప్రదర్శించారు. 14వ రోమ్ చిత్ర ఉత్సవంలో స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకుంది. ఇటీవల కేరళలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరై 'స్పిరిట్ ఆఫ్ సినిమా' అవార్డును మహనాజ్ మొహమ్మద్ అందుకోవాల్సి ఉంది.

అయితే ఆమె దేశం విడిచి వెళ్లకుండా అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నేపథ్యంలోనే మహనాజ్ తన జట్టుకు కత్తిరించి కేరళ ఫిల్మ్ ఫెస్టివల్ కు పంపి నిరసన తెలిపారు. ఈ వేడుకలో ఆమె తరఫున ఐఎఫ్ఎఫ్‌కే జ్యూరీ సభ్యులు.. గ్రీక్ ఫిల్మ్ మేకర్ అథిన రాచెల్ సంగారి ఈ అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత సంగారి మొహమ్మదీ పంపిన జుట్టును ప్రేక్షకులకు చూపించారు.

ఈ సందర్భంలో ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. పెద్ద సంఖ్యలో అభిమానులు ఆమెకు మద్దతుగా నిలిచి చప్పట్లు కొడుతూ మొహమ్మదీ చర్యను అభినందించారు. ''ప్రతి రోజూ.. ప్రతి సందర్భంలో మేం ఎదుర్కొంటున్న సంఘటనలకు చిహ్నమే ఈ జుట్టు కత్తిరించుకోవడం'' అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ చిత్ర ప్రదర్శనలో తనకు వచ్చిన స్పందనను చూసి తాను కన్నీటిని ఆపులేకపోయానని మొహమ్మదీ భావోద్వేగానికి గురయ్యారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.