Begin typing your search above and press return to search.

మైనర్ బాలిక పై ఐపీఎస్ అత్యాచారం

By:  Tupaki Desk   |   6 Jan 2020 11:56 AM GMT
మైనర్ బాలిక పై ఐపీఎస్ అత్యాచారం
X
దారుణం చోటు చేసుకుంది. అసోంలో వెలుగు చూసిన ఈ ఉదంతం గురించి విన్నంతనే ఒళ్లు మండిపోవటమే కాదు.. ఆగ్రహం తో ఏమైనా చేయాలన్న భావన కలగటం ఖాయం. అత్యుత్తమ స్థానాల్లో ఉన్న ఉన్నతాధికారి చేసిన దుర్మార్గం మింగుడు పడటం లేదు. ఐపీఎస్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఒక అధికారి 13 ఏళ్ల చిన్నారిని అత్యాచారం చేసిన వైనం కాస్త ఆలస్యంగా బయట కు వచ్చింది.

అసోంలోని కర్బీఅంగ్ లాంగ్ పట్టణంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ వ్యవహారంలో 2012 బ్యాచ్ కు చెందిన గౌరవ్ ఉపాధ్యాయ గత ఏడాది జనవరి నుంచి కర్బీఅంగ్ లాంగ్ జిల్లా కు ఎస్పీ గా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది చివరి రోజైన డిసెంబరు 31న ఆయన నివాసంలో విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఒక మహిళా పోలీసు అధికారి తన పదమూడేళ్ల బాలికను తీసుకొచ్చారు.

ఆ బాలిక మీద కన్నేసిన ఎస్పీ.. ఆమెను బలవంతంగా రూమ్ కి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తనకు జరిగిన దారుణం గురించి సదరు బాధిత బాలిక తన తల్లి కి జరిగింది చెప్పటంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్పీ మీద పోక్సో చట్టం కింద కేసును నమోదు చేశారు గువాహటి పోలీసులు.

ఇదిలా ఉంటే.. ఈ ఉదంతంలో నిజం లేదని.. అవన్నీ తప్పుడు ఆరోపణలుగా కొట్టి పారేస్తున్నారు. మరోవైపు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్పీకి పలు మీడియా సంస్థలు ఫోన్ చేసినా ఆన్సర్ చెప్పటం లేదంటున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనం గా మారింది. ఇలాంటి ఉదంతాల పై తీవ్రంగా స్పందించే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జన్నార్ కుతెలిస్తే.. ఆయన ఎలా రియాక్ట్ అవుతారో?