Begin typing your search above and press return to search.

ఐపీఎస్ భార్యకే చుక్కలు చూపించిన భర్త.. ఆమేం చేసిందంటే?

By:  Tupaki Desk   |   7 Feb 2021 12:45 PM IST
ఐపీఎస్ భార్యకే చుక్కలు చూపించిన భర్త.. ఆమేం చేసిందంటే?
X
లక్షలాది మంది ప్రయత్నిస్తే తప్పించి ఐపీఎస్ అధికారి కావటం అంత తేలిక కాదు. దేశంలోనే అత్యుత్తమ సర్వీసుల్లో ఉన్న మహిళ భార్యగా రావటానికి మించిన లక్ ఏముంటుంది. కానీ.. ఆ భర్త మాత్రం అలా ఆలోచించలేదు. ఉన్న దానితో త్రప్తి లేక.. లేని దాని కోసం ఆశ పడిన అతగాడి వ్యవహారం ఇప్పుడు కేసుల వరకు వెళ్లింది. కట్నం కోసం ఐపీఎస్ భార్యను వేధింపులకు గురి చేసి.. దాడి చేసిన ఐఎఫ్ఎస్ భర్త వ్యవహారం కర్ణాటకలో వెలుగు చూసింది. భర్త తీరుతో విసుగు చెందిన ఆమె.. పోలీసులకు ఫిర్యాదు చేయటంతో.. ఆ ఉన్నతాధికారి అసలు స్వరూపం తాజాగా బయటకు వచ్చింది.

యూపీకి చెందిన 2009 బ్యాచ్ ఐపీఎస్ అధికారిక వర్తికా కటియార్ బెంగళూరు పోలీసు ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు 2011లో ఐఎఫ్ఎస్ (ఇండియన ఫారిన్ సర్వీస్) అధికారి నితిన్ తో వివామైంది. భర్త ఢిల్లీలోని భారత రాయబార కార్యాలయంలో పని చేసేవారు. దురలవాట్లకు గురైన భర్తను మార్చుకోవటానికి ఆమె తెగ ప్రయత్నించింది. అయినప్పటికి అతడిలో మార్పు రాలేదు.

అంతేకాదు.. అదనపు కట్నం కోసం దాడి చేయటం.. దీపావళి కానుక ఇవ్వలేదని విడాకులకు కోసం బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతేకాదు.. తన అమ్మమ్మ వద్ద రూ.5లక్షలు ఒకసారి.. మరోసారి రూ.35 లక్షలు తీసుకున్నాడని పేర్కొన్న ఆమె.. తనపై దాడి చేసినందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో.. భర్త నితిన్ తో సహా అతని కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపులు.. ప్రాణహాని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.