Begin typing your search above and press return to search.
మా దేశాన్ని కాపాడండి .. స్టార్ క్రికెటర్ ఆవేదన !
By: Tupaki Desk | 12 Aug 2021 1:01 PM ISTఆఫ్గనిస్తాన్ స్టార్ క్రికెటర్ , ఐపీఎల్ సన్ రైజర్స్ స్టార్ రషీద్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. తన స్పిన్ బౌలింగ్ తో బ్యాటమెన్స్ ను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించడంలో దిట్ట . ఇంటర్నేషనల్ క్రికెట్ లోనే కాకుండా ఐపీఎల్ లోనూ కీలకమైపోయాడు రషీద్ ఖాన్. సన్‌రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో తెలుగోళ్లకు బాగా కనెక్ట్ అయిపోయాడు. అక్టోబర్ – నవంబర్ మధ్యలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ లో కీలక ప్లేయర్ కానున్నాడు రషీద్. అంతేగాక, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీ-20 క్రికెట్ లీగుల్లో రషీద్ ఖాన్ ఓ హాట్ ఫేవరేట్ క్రికెటర్. ఈ మధ్యనే అఫ్గాన్ టీంకు కెప్టెన్ గా సెలక్ట్ అయ్యాడు.
తమ దేశం రావణకాష్టంగా మారుతుండటాన్ని చూసి తట్టుకోలేకపోతున్న స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్, తమను ఇలా గందరగోళంలో వదిలేయకండి అని ప్రపంచ నేతలను వేడుకుంటున్నాడు.ప్రస్తుతం అఫ్గనిస్తాన్లోని 65 శాతం భూభాగం మళ్లీ తాలబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది.దాదాపు 400 జిల్లాలో సగానికి పైగా తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆగష్టు 31 లోపు అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
అఫ్గనిస్తాన్ నుంచి అమెరికా దళాలు వెనక్కి వెళ్తుండటంతో మరోసారి ఆ దేశం మెల్లగా తాలిబన్ల గుప్పిట్లోకి వెళ్తోంది. దేశంలోని ఒక్కో ప్రాంతాన్ని తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. దీంతో అఫ్ఘన్ సైన్యం, తాలిబన్ల మధ్య యుద్ధం సాధారణ ప్రజలను బలి తీసుకుంటోంది. దీంతో అఫ్గనిస్తాన్ స్పిన్ బౌలర్ రషీద్ ఖాన్, ట్విట్టర్ వేదికగా తమ దేశాన్ని కాపాడాలంటూ వేడుకుంటున్నారు. ఈ గందరగోళం నుంచి కాపాడి శాంతి ప్రసాదించాలంటూ ప్రపంచ నాయకులకు సందేశం పంపాడు. మానవత్వం కొరవడి సంక్షోభం ఏర్పడిన క్రమంలో వేల కుటుంబాలు హింసకు గురవుతున్నాయని, చిన్నారులు, మహిళలని కూడా ఉపేక్షించకుండా హింసిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ నాయకులారా, నా దేశం గందరగోళంలో పడి ఉంది. చిన్నారులు, మహిళలతో సహా వేల మంది అమాయకులు ప్రతిరోజూ ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఇల్లు, ఆస్తులు అన్నీ ధ్వంసం అవుతున్నాయి. వేల మంది కుటుంబాలను కోల్పోతున్నారు. మమ్మల్ని ఈ గందరగోళంలో వదిలేయకండి. అఫ్గాన్ చావులను ఆపండి, అఫ్గానిస్తాన్ ను నాశనం చేయకండి. మేం శాంతి కోరుకుంటున్నాం అని ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.