Begin typing your search above and press return to search.

క్రికెట్ ప్రియులకు బ్యాడ్ న్యూస్..ఐపీఎల్ వాయిదా

By:  Tupaki Desk   |   13 March 2020 9:57 AM GMT
క్రికెట్ ప్రియులకు బ్యాడ్ న్యూస్..ఐపీఎల్ వాయిదా
X
కరోనా వైరస్ ..ఈ మహమ్మారి వల్ల నష్టపోని రంగం అంటూ ప్రపంచంలో ఏది లేదు. చైనా లో పుట్టిన ఈ వైరస్, ఆ తరువాత ప్రపంచంలోని చాలా దేశాలకి విస్తరించింది. ఈ కరోనా దెబ్బకి ప్రస్తుతం అన్ని ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ కుదేలైయింది. ఇక క్రీడల రంగం కూడా కరోనాతో ఇబ్బందులు పడుతోంది. ఇప్పటికే పలు టోర్నీలని ప్రేక్షకులు లేకుండానే నిర్వహిస్తున్నారు. కొన్ని టోర్నీలని వాయిదా వేశారు. అయితే, కరోనా ప్రభావం ఉన్నప్పటికీ ప్రపంచంలోనే ఖరీదైన లీగ్ గా పేరుతెచ్చుకున్న ఐపీఎల్ ని ఖచ్చితంగా అనుకున్న సమయానికే ప్రారంభిస్తాం అంటూ గత కొన్ని రోజులుగా బీసీసీఐ అధినేత , మాజీ కెప్టెన్ గంగూలీ చెప్తున్నారు.

కానీ , కరోనా భారత్ లో కూడా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఐపీఎల్ ని రద్దు చేయాలంటూ కేంద్రాన్ని కోరడంతో దీనిపై మరోసారి ఆలోచించిన బీసీసీఐ మొదట ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అయితే , తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ..ఐపీఎల్ అంటేనే అభిమానులు ..కేకలు , గోల ...అదిలేనప్పుడు ఐపీఎల్ మజానే మిస్ అవుతుంది అని భావించి ..
బీసీసీఐ మనసు మార్చుకుంది.

ఐపీఎల్ ప్రారంభ తేదీని వాయిదా వేసింది. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ తాజా సీజన్ మార్చి 29న ప్రారంభం కావాలి...కానీ ,భారత్ లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండడంతో ఒకేసారి అంతమంది గుమ్మిగూడటం మంచిది కాదు అని భావించి, ఐపీఎల్ ప్రారంభాన్ని ఏప్రిల్ 15కి వాయిదా వేశారు. ఏప్రిల్ 15కి కూడా కరోనా భారత్ లో అదుపులోకి రాకపోతే , ఆ తరువాత ఐపీఎల్ 2020 పై తుది నిర్ణయం తీసుకోనున్నారు అని సమాచారం.