Begin typing your search above and press return to search.

ఐపీఎల్ : ఆన్ లైన్ బెట్టింగ్ షురూ..ముగ్గురు అరెస్ట్!

By:  Tupaki Desk   |   18 Sept 2020 6:00 PM IST
ఐపీఎల్ : ఆన్ లైన్ బెట్టింగ్ షురూ..ముగ్గురు అరెస్ట్!
X
ఐపీఎల్ .. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి.. మరికొద్ది గంటల్లోనే తెర లేవనుంది. మార్చి నుండి క్రికెట్ లేక , ఢీలా పడిపోయినా క్రికెట్ ఫాన్స్ కి ఉత్సహాన్ని ఇస్తూ ఐపీఎల్ ప్రారంభం అవుతుంది. తొలిసామరమే ముంబై , చెన్నై మధ్య జరగబోతుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఇక ఇదిలా ఉంటే .. అప్పుడే ఐపీఎల్ బెట్టింగ్స్ కూడా మొదలైయ్యాయి. ఆన్‌ లైన్‌ లో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొబైల్ యాప్‌ల ద్వారా ఆన్‌ లైన్ ‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తోన్న ముఠాను మాచవరం పోలీసులు అరెస్టు చేశారు.

వీరికి దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు కొన్ని ఇతర దేశాలతో కూడా సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మాచవరం పిఎస్ పరిధిలోని ఓ అపార్ట్ మెంట్లో గుట్టుచప్పుడు కాకుండా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పూర్తి సమాచారంతో అర్ధరాత్రి సమయంలో పోలీసులు దాడి నిర్వహించారు. వారి నుంచి టీవీ, ల్యాప్ టాబ్, 23 లైన్లో ఉన్న ఫోన్ బాక్స్ , 25 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు బుకీలును అదుపులోకి తీసుకోగా, వారిలో ప్రధాన బుకీ నవీన్ కోసం గాలిస్తున్నారు. జాతీయ క్రికెట్ బుకీలతో ఉన్న సంబంధాల పై విచారణ చేస్తున్న పోలీసులు. ఐపీఎల్ మరికొన్ని గంటల్లో మొదలు కాబోతుండగా ఇలాంటి బుకీలు రంగంలోకి దిగారు. ఆన్ లైన్ దందాకు తెరలేపారు. ఇలాంటి మఫియాలు తెలుగు రాష్ట్రాల్లోని ఐపీఎల్ ప్రియులను వల వేసి పట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఈసారి పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనితో పోలీసులు కూడా దానికి తగ్గట్టుగా వ్యూహాలు రచిస్తున్నారు.