Begin typing your search above and press return to search.

IPL : మళ్లీ కరోనా కలకలం.. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు?

By:  Tupaki Desk   |   21 April 2022 7:26 AM GMT
IPL : మళ్లీ కరోనా కలకలం.. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు?
X
భారత టీ20 లీగ్ లో ఈ సీజన్ లోనూ కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా దిల్లీ జట్టులోని ఆరుగురు ఆటగాళ్లకు కరోనా సోకింది. అయితే పోయిన సంవత్సరం కూడా ఇలాగే సగం సీజన్ పూర్తయ్యాక బయో బబుల్ లోని వివిధ జట్లలో కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి కారణంగా దెబ్బకు టోర్నీని నిరవధిక వాయిదా వేసి తిరిగి సెప్టెంబర్-అక్టోబర్ లో యూఏఈలో నిర్వహించారు. అయితే ప్రస్తుత సీజన్ లో మరిన్ని కేసులు పెరిగితే ఏం చేస్తారన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే చాలా మంది గత ఏడాది లాగే టోర్నీని వాయిదా వేస్తారని అనుకుంటున్నారు. మరి ఈ ఏడు ఏం చేయబోతున్నారో తెలియాలంటే ఇంకా కొన్నాళ్లు ఆగాల్సిందే.

సీజన్ ప్రారంభానికి ముందు దేశంలో కరోనా కేసులు తగ్గాయి. దీంతో టీ20 టోర్నీని ఇక్కడే నిర్వహించాలని ప్రణాళికలు రూపొందించారు. అందుకు తగ్గుట్టుగానే ముంబయి, పుణేలో.. నాలుగు స్టేడియాల్లో మొత్తం లీగ్ మ్యాచ్ లు నిర్వహించాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే మార్చి 26న ప్రారంభమైన 15వ సీజన్ మూడు వారాల పాటు సజావుగా సాగింది. ప్రస్తుతం ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు.

ముందుగా ఫిజియో ప్యాట్రిక్ ఫొర్ హత్ కరోనా బారిన పడగా.. తర్వాత స్పోర్ట్స్ మసాజ్ థెరపిస్ట్ చేతన్ కుమార్, విదేశీ ఆటగాడు మిచెల్ మార్ష్, టీమ్ డాక్టర్ అభిజిత్ సాల్వి, సోషల్ మీడియా కంటెంట్ టీమ్ సభ్యుడు ఆకాశ్ మనే పాజిటివ్ గా తేలారు.

ఇక బుధవారం పంజాబ్ తో మ్యాచ్ ప్రారంభానికి ముందు నిర్వహించిన యాంటిజెన్ పరీక్షల్లో వికెట్ కీపన్, బ్యాట్స్ మెన్ టిమ్ సీఫర్ట్ కూడా వైరస్ బారిన పడ్డారు. దీంతో అందరిలోనూ పంజాబ్ తో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే టెన్షన్ ప్రారంభమైంది.

టోర్నీ ప్రారంబానికి ముందే ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఏం చేయాలన్న దానిపై నిర్వాహకులు నిబంధనలు రూపొందించారు. ఏ జట్టులోనైనా మ్యాచ్ జరిగే రోజు మొత్తంగా 12 మంది ఆటగాళ్లు ఫిట్ గా ఉండాలి. వారిలో 11 మంది తుది జట్టులో ఆడాల్సి ఉండగా.. ఒకరిని సబ్ స్టిట్యూట్ గా ఎంచుకోవాలి. అందులోనూ ఏడుగురు భారత క్రికెటర్లు ఉండాలి. ఒకవేళ ఏ కారణం చేతనైనా అలా 12 మంది లేని పక్షంలో ఈ రోజు మ్యాచ్ ను వాయిదా వేస్తారు. మళ్లీ రీషెడ్యూల్ చేసి మళ్లీ నిర్వహిస్తారు.

అయితే అప్పుడు కూడా అది కుదరని పక్షంలో విషయాన్ని టోర్లీ టెక్నికల్ విభాగానికి తీసుకెళ్తారు. అక్కడ వాళ్లు అన్ని విధాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయమై తుది నిర్ణయం. ఈ నేపథ్యం లోనే బుధవారం పంజాబ తో ఆటకు ముందు ఢిల్లీ ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహించి.. వాటిల్లో నెగిటివ్ గా వచ్చి వారితో మ్యాచ్ కొనసాగించారు. అయితే ఇక్కడ వేదిక ను మాత్రం మార్చారు. ఇది షెడ్యూల్ ప్రకారం పుణెలో జరగాల్సి ఉండగా... ముంబయిలోనే నిర్వహించారు. అయితే మరి తాజా పరిస్థితుల దృష్ట్యా మ్యాచ్ లు నిర్వహిస్తారా.. వాయిదా వేస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.