Begin typing your search above and press return to search.

వరల్డ్ ​కప్​ ను తలపించేలా.. ఐపీఎల్ 2021.. ఇక ఫ్యాన్స్​ కు పండగే..!

By:  Tupaki Desk   |   8 Dec 2020 8:44 AM IST
వరల్డ్ ​కప్​ ను తలపించేలా..  ఐపీఎల్ 2021.. ఇక ఫ్యాన్స్​ కు పండగే..!
X
ఐపీఎల్​ 2021లో భారీ మార్పులు జరగబోతున్నాయంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. కొత్త జట్లు చేరబోతున్నాయని.. మ్యాచ్​ల నిర్వహణ పద్ధతి కూడా మార్చబోతున్నారని సమాచారం. అయితే కొత్తగా ఏఏ జట్లు వచ్చి చేరుతున్నాయి. మ్యాచ్​లు ఏ విధంగా నిర్వహించబోతున్నారని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ విషయంపై ఇంకా బీసీసీఐ క్లారిటీ ఇవ్వలేదు.

కరోనా కారణంగా ఐపీఎల్​ 2020 లేట్​ గా ప్రారంభమయిన విషయం తెలిసిందే. దీంతో ఆ వెంటనే ఐపీఎల్​ 2021పై కూడా ఊహాగానాలు, వార్తలు మొదలయ్యాయి. అయితే ఈ విషయంపై చర్చించేందుకు ఈ నెల 24న బీసీసీఐ సమావేశం కానున్నది. ఈ మీటింగ్​లో అన్ని విషయాలపై క్లారిటీ రానున్నది. ఐపీఎల్​ 2020ని పదిజట్లతో నిర్వహించేందుకు బీసీసీఐ పెద్దలు సూత్రప్రాయంగా అంగీకరించనట్టు సమాచారం. గతంలోనూ పదిజట్లతో ఆడించిన చరిత్ర ఐపీఎల్​కు ఉన్నది. అప్పట్లో పుణే వారియర్స్​, కొచ్చి టస్కర్స్​ ఉండేవి. కానీ 2013లో వీటి కథ ముగిసింది. ఆ తర్వాత మళ్లీ 2021లో కొత్త జట్ల ప్రస్తావన ముందుకొచ్చింది.

అయితే గుజరాత్​కు చెందిన అదానీ గ్రూప్​ ఓ కొత్త జట్టుకు ప్రాతినిథ్యం వహించాలని తహతహలాడుతోంది. మరోవైపు రైజింగ్​ పుణే ఫ్రాంచైజీ సంజీవ్​ గొయెంకా కూడా తన సంస్థను తిరిగి తీసుకురావాలని యోచిస్తున్నాడు. అయితే ఈసారి అహ్మదాబాద్ ఫ్రాంచైజీ పేరు ఖాయమైందని సమాచారం. ప్రస్తుతం ఐపీఎల్​ రాబిన్​ పద్ధతిలో జరుగుతున్నది. అంటే ఒక్కో జట్టు మరొక జట్టుతో రెండుసార్లు తలపడుతుంది. ప్రస్తుతం ఒకజట్టు 14 మ్యాచ్​లు ఆడుతున్నది. అయితే జట్లసంఖ్య పెరిగితే ఈ సంఖ్య 18కి చేరవచ్చు. అప్పుడు సుదీర్ఘ ఐపీఎల్ సీజన్ అవుతునందేది కాదనలేని వాస్తవం.

ఈ ఫార్మాట్ నిర్వహించడం కూడా బీసీసీఐకి పెద్ద తలనొప్పే. అందుకే బీసీసీఐ 2011 ఫార్మాట్‌ను పరిశీలించే అవకాశం ఉంది. 2011లో 10 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయాయి. లీగ్ దశలో అన్ని జట్లు 14 మ్యాచ్‌లే ఆడాయి. అలా కాకుండా కొత్త పద్ధతిపై కూడా బీసీసీఐ సమాలోచనలు చేస్తోంది. అయితే ఐపీఎల్​ 2021 నిర్వహణపై ఊహాగానాలే తప్ప ఇంతవరకు క్లారిటీ రాలేదు. బీసీసీఐ సమావేశం తర్వాత వీటిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది.