Begin typing your search above and press return to search.

ఐపీఎల్ 2021 కొత్త గీతం.. ఇండియాకా అప్నా మంత్ర!

By:  Tupaki Desk   |   26 March 2021 12:30 AM GMT
ఐపీఎల్ 2021 కొత్త గీతం.. ఇండియాకా అప్నా మంత్ర!
X
ఐపీఎల్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న 2021 గీతం వచ్చేసింది. ఇండియాకా అప్నా మంత్ర పేరిట ఈ పాటను ఐపీఎల్ నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు. ఒక్క నిమిషం 30 సెకన్ల పాటు చిత్రీకరించారు. ఈ గీతాన్ని భారతదేశం ఆత్మగా ఐపీఎల్ బోర్డు అభివర్ణిస్తోంది. ఐపీఎల్ సీజన్ కోసం ఏటా ప్రత్యేక గీతాన్ని రూపొందించే బీసీసీఐ.. ఈసారి ఇండియా సక్సెస్ మంత్ర పేరిట విడుదల చేసింది. వచ్చే నెల 9 నుంచి 14వ సీజన్ ప్రారంభమవనుంది.

ఆటగాళ్ల స్టెప్పులతో జోరు

సక్సెస్ మంత్రగా చెబుతున్న ఈ ఆంథెమ్ స్కూల్ పిల్లలతో మొదలవుతుంది. పెద్దవాళ్లతో సాగుతూ ఆ తర్వాత విరాట్ కోహ్లీ(ఆర్సీబీ), రోహిత్ శర్మ(ఎమ్ఐ), కేఎల్ రాహుల్(కేపీ), శుభమన్ గిల్(కేకేఆర్), రిషబ్ పంత్(డీసీ)తో పాటు సాహా(ఎస్ఆర్ హెచ్), రియాన్ పరాగ్(ఆర్ఆర్), కృష్ణప్ప గౌతమ్(సీఎస్కే) ఆటగాళ్లతో స్టెప్పులేయించారు. ఇలా జోరుగా సాగిన ఈ పాట అభిమానుల్లో ఉత్సాహం పెంచుతోంది.

2021 ఐపీఎల్ పోరు

ఏప్రిల్ 9నుంచి ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య పోరుతో ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభమవనుంది. 52 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో 60 మ్యాచ్‌లు జరగనుండగా.. 6 సిటీలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. చెన్నై, బెంగళూరు, ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, అహ్మదాబాద్ సిటీల్లో మ్యాచ్ లు జరగనున్నాయి. ఏ జట్టుకీ సొంతగడ్డపై ఆడే అవకాశం లేదు. తొలి పోరు‌ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. ఐపీఎల్ కోసం ఏడాది అంతా ఎదురుచూసే అభిమానులు ఉన్నారంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు.

కరోనా ఎఫెక్ట్

2008లో మొదలైన ఐపీల్ సీజన్.. ఈసారి 14వది. గతేడాది ఈ పోరు అరబ్ దేశాల్లో జరిగింది. కరోనా నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ లు నిర్వహించారు. ఈ సీజన్ ని భారత్ లోనే జరపనున్నారు. ఈసారీ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మ్యాచ్ లు ఎలా జరగనున్నాయనే అంశంపై ఆసక్తి నెలకొంది.