Begin typing your search above and press return to search.

హ్యాట్రిక్ విజయంతో 'టాపు'లేపిన ఢిల్లీ!

By:  Tupaki Desk   |   10 Oct 2020 9:30 AM IST
హ్యాట్రిక్ విజయంతో టాపులేపిన ఢిల్లీ!
X
యువ ఢిల్లీ జోరు సాగుతోంది. మరో విజయాన్ని తన ఖాతా లో వేసుకుంది. షార్జా వేదికగా రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో సత్తా చాటి హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకుంది. 46 పరుగుల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్ర స్థానాన్ని సాధించింది. బ్యాటింగ్ లో హెట్ మెయిర్ మెరుపులు మెరిపించగా.. స్టోయినిస్ బ్యాటింగ్ - బౌలింగ్ లోనూ ఆకట్టుకున్నారు.

టాస్ ఓడి ముందు గా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఎనిమిది వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. హెట్‌మెయిర్‌(45; 24 బంతుల్లో 1 ఫోర్‌, 5 సిక్స్‌లు), మార్కోస్‌ స్టోయినిస్‌(39; 30బంతుల్లో 4 సిక్స్‌లు), శ్రేయస్‌ అయ్యర్‌(22;18 బంతుల్లో 4 సిక్స్‌లు)లు మెరుపులు మెరిపించారు. ధావన్‌(5), పృథ్వీషా(19), శ్రేయస్‌ అయ్యర్‌(22; 18 బంతుల్లో 4 ఫోర్లు), రిషభ్‌ పంత్‌(5) విఫలం అయ్యారు.చివర్లో హర్షల్‌ పటేల్‌(16 నాటౌట్‌), అక్షర్‌ పటేల్‌(17) వేగంగా ఆడారు. రాజస్థాన్ బౌలర్ల లో జోఫ్రా ఆర్చర్‌ మూడు వికెట్లు తీశాడు.

185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ యశస్వి జైస్వాల్‌(34; 36 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు), తెవాటియా(38; 29 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్స్‌లు) మాత్రమే రాణించారు. స్టార్ బ్యాట్స్ మెన్లు సంజూ శాంసన్‌(5) స్టీవ్‌ స్మిత్‌(24; 17 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్‌), జోస్‌ బట్లర్‌(13; 8 బంతుల్లో 2 ఫోర్లు) చేతులెత్తేసారు.జట్టు లో ఏడుగురు సింగిల్‌ డిజిట్‌ కే పరిమితం కావడం తో రాజస్థాన్ కోలుకో లేక పోయింది. ఆ జట్టు 19.3 ఓవర్ల లో 138 పరుగులకే ఆలౌటై పరాజయం చెందింది.

ఢిల్లీ 50 పరుగులకే మూడు వికెట్లు

50 పరుగులకే మూడు వికెట్లు పోయిన ఢిల్లీని హెట్‌మెయిర్‌-స్టోయినిస్‌ల జోడి ఆదుకుంది.స్టోయినిస్‌ నాలుగు సిక్స్‌లతో అలరించాడు. విరుచుకుపడితే, ఆపై హెట్‌మెయిర్‌ వరుసబెట్టి బౌండరీలు బాదాడు. శ్రేయాస్ కూడా క్రిజ్ లో ఉన్నింది కాసేపే అయినా నాలుగు ఫోర్లు బాదాడు.

ఢిల్లీ బౌలర్ల మాయ

మ్యాచ్ లో ఢిల్లీ బౌలర్లు రాజస్థాన్ బ్యాట్స్ మెన్లు కుదురుకోకుండా వరుసగా వికెట్లు తీశారు. దీంతో ఆ జట్టు కోలుకోలేక పోయింది. ఢిల్లీ బౌలర్లలో రబడా మూడు వికెట్లు సాధించగా, స్టోయినిస్‌, అశ్విన్‌ లు తలో రెండు వికెట్లు సాధించారు. హర్షల్‌, నోర్త్‌జే, అక్షర్‌ పటేల్‌లకు ఒక్కో వికెట్‌ లభించింది. పొదుపుగా బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీసిన అశ్విన్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.