Begin typing your search above and press return to search.

ఐపీఎల్: పంజాబ్ ఓటమిపై రగిలిపోతున్న ఫ్యాన్స్

By:  Tupaki Desk   |   21 Sept 2020 2:40 PM IST
ఐపీఎల్: పంజాబ్ ఓటమిపై రగిలిపోతున్న ఫ్యాన్స్
X
ఐపీఎల్ రంజుగా సాగుతోంది. మొదటి మ్యాచ్ లో బలమైన ముంబైని చెన్నై ఓడించి సంచలనం సృష్టించగా.. రెండో మ్యాచ్ ఏకంగా టై అయ్యి సూపర్ ఓవర్ కు దారితీయడం విశేషం.

అయితే రెండో మ్యాచ్ లో తలపడ్డ పంజాబ్, ఢిల్లీ మధ్య మ్యాచ్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఢిల్లీ బ్యాట్స్ మెన్ 20 బంతుల్లోనే 50 కొట్టి దుమ్మురేపాడు. మ్యాచ్ డ్రా కావడంతో సూపర్ ఓవర్ లో ఢిల్లీ గెలిచింది. అయితే ఢిల్లీ గెలిచినా మ్యాచ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా పంజాబ్ ఓడిపోవడానికి కారణాలు వెల్లడించి విమర్శించాడు.

పంజాబ్ గెలిచి తీరాల్సిన ఈ మ్యాచ్ లో ఓటమికి అంపైర్ల తప్పుడు నిర్ణయాలే కారణమని సెహ్వాగ్ ఆరోపించాడు. అంపైరింగ్ లోపాలు ఢిల్లీని గెలిపించాయని మండిపడ్డారు. పంజాబ్ ఇన్నింగ్స్ లో జోర్డన్ రన్ తీసే క్రమంలో క్రీజులో బ్యాట్ పెట్టినా అంపైర్ దాన్ని షార్ట్ రన్ గా పరిగణించి ఒక రన్ ను కోత పెట్టాడు. ఇప్పుడు పంజాబ్ ఆ ఒక్కరన్ తో ఓడిపోవడంతో అంపైర్ నిర్ణయం వల్లే పంజాబ్ ఓడిందని సెహ్వాగ్ సహా అందరూ ఆరోపిస్తున్నారు. పంజాబ్ ఓటమికి అంపైర్లే కారణమని మండిపడ్డారు.

ఇక ఈ మ్యాచ్ లో పంజాబ్ తరుఫున ఆడుతున్న మంచి ఫించ్ హిట్టర్ అయిన వెస్టిండీస్ ఆటగాడు నైట్ మేర్ రెండు సార్లు సున్నాకే డకౌట్ అయ్యి ఘోరమైన అపవాదును మూటగట్టుకున్నాడు. ఐపీఎల్ లో చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. ఒక మ్యాచ్ లో రెండు సార్లు డకౌట్ అయ్యి నిరాశపరిచాడు. మ్యాచ్ లో తరువాత సూపర్ ఓవర్ లోనూ నైట్ మేర్ తేలిపోవడం పంజాబ్ ఓటమికి కారణమైందన్న అపవాదు ఉంది. ఇలా ఈ రెండు కారణాలు పంజాబ్ ఓటమికి కారణంగా తేల్చారు.