Begin typing your search above and press return to search.
మూడు జట్ల భవిష్యత్తు ముంచేది.. తేల్చేది హైదరాబాదే.. ఉత్కంఠగా ప్లే ఆఫ్స్ రేసు
By: Tupaki Desk | 2 Nov 2020 12:00 PM ISTఐపీఎల్ 2020 రసవత్తరంగా సాగుతున్నది. ప్లే ఆఫ్స్ చేరుకొనే జట్లపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొన్నది. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే రేసు నుంచి తప్పుకోగా.. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ఆదివారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అనూహ్యంగా ధోనీ సేన గెలుపొందడంతో లెక్కలు మారాయి. సీఎస్కే పోతూ పోతూ.. పంజాబ్ జట్టును కూడా తన వెంట తీసుకెళ్లింది. ఆదివారం సాయంత్రం జరిగిన మరో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించి.. ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. ఇక రాజస్థాన్ రాయల్స్ కూడా రేసు నుంచి తప్పుకున్నట్టే. ఇక మిగిలినవి అయిదు జట్లు. ప్లే ఆఫ్స్ వెళ్లాల్సింది నాలుగు టీమ్‌లే. ప్లే ఆఫ్స్ రేసు నుంచి బయటపడే ఆ ఒక్కటీ ఏదనేది ఉత్కంఠకు గురి చేస్తోంది.
నేటి పోరు ఎంతో కీలకం
ఢిల్లీ కేపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఈ సాయంత్రం తలపడబోతున్నాయి. ఈ రెండింట్లో ఏ జట్టు గెలిచినా ప్లేఆఫ్స్ ప్లేస్‌ను ఖాయం చేసుకుంటుంది. ఈ రెండింటి అకౌంట్‌లో చేరో 14 పాయింట్లు ఉన్నాయి. ప్లేఆఫ్స్ చేరడానికి ఇంకో రెండు పాయింట్లు అవసరం. ఆ రెండు పాయింట్ల కోసం ఈ సాయంత్రం పోరాడబోతున్నాయి. గెలిచిన టీమ్.. నేరుగా ప్లేఆఫ్స్ కు చేరుకుంటుంది. ఓడిన టీమ్ కూడా రేసులోనే ఉంటుంది. కానీ అది తర్వాత జరిగే మ్యాచ్ మీద ఆధారపడి ఉంటుంది. ప్లేఆఫ్స్ నిలవాలి అంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో మంగళవారం ఆడబోతోంది వార్నర్ సేన. అన్ని విభాగాల్లోనూ తన కంటే బలమైన ముంబై ఇండియన్స్‌ను ఢీ కొట్టబోతోంది. ఈ సీజన్ లీగ్ దశలో ఇదే చివరి మ్యాచ్. ఇందులో గెలిస్తే సన్ రైజర్స్ ప్లేఆఫ్స్ రేస్‌లో నిలుస్తుంది. అదే సమయంలో ఢిల్లీ కేపిటల్స్.. రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే మ్యాచ్‌లో ఆ జట్లు సాధించే నెట్ రన్‌రేట్ ప్రభావం చూపుతుంది.
ఇదీ ఈక్వేషన్..
ఉదాహరణకు- గేమ్-1లో ఢిల్లీ కేపిటల్స్ తొలుత బ్యాటింగ్ చేసి..160 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిదనుకుంటే.. 21 పరుగుల తేడాతో బెంగళూరును ఓడించాల్సి ఉంటుంది. లేదా తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్దేశించే 160 పరుగుల లక్ష్యాన్ని 17.3 ఓవర్లలో ఛేదించాల్సి ఉంటుంది. మంగళవారం జరిగే గేమ్-2లో హైదరాబాద్ జట్టు ముంబైపై విజయాన్ని సాధించితే.. కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేఆఫ్స్ నుంచి వైదొలగుతుంది. ముంబై ఇండియన్స్ చేతిలో సన్ రైజర్స్ ఓడిపోతే..ఈక్వేషన్లతో పెద్దగా పని ఉండదు. హైదరాబాద్ కంటే రెండు పాయింట్లు ఎక్కువే సాధించిన కోల్ కతా ప్లేఆఫ్స్ చేరుకుంటుంది.