Begin typing your search above and press return to search.

కుమ్మేసిన కోల్ కతా..చెన్నైకి మరో ఓటమి

By:  Tupaki Desk   |   8 Oct 2020 9:15 AM IST
కుమ్మేసిన కోల్ కతా..చెన్నైకి మరో ఓటమి
X
ఐపీఎల్లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో కోల్ కతా సూపర్ విక్టరీ సాధించింది. ఇచ్చింది స్వల్ప లక్ష్యమే అయినా దానిని కాపాడుకుని విజేతగా నిలిచింది. ఎప్పుడూ చివర్లో బ్యాటింగ్ కి వచ్చే రాహుల్ త్రిపాఠి ఈసారి ఓపెనర్ గా అవతారం ఎత్తి బ్యాటింగ్ విధ్వంసం సృష్టించాడు ఏకంగా 51 బంతుల్లో 81(8 ఫోర్లు, 3 సిక్సర్లు) రన్స్ చేశాడు. ఛేదనలో చెన్నై తడబాటుకు గురవడంతో పది పరుగుల తేడాతో ఓడిపోయింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా జట్టు సునీల్‌ నరైన్‌ స్థానంలో రాహుల్‌ త్రిపాఠిని, శుభ్ మన్ గిల్ ఓపెనర్‌గా పంపించింది. త్రిపాఠి (81) మెరుపు బ్యాటింగ్ తో బౌండరీల వర్షం కురిపించాడు.

37 పరుగుల వద్ద గిల్ ఔట్ అయినా త్రిపాఠి జోరు తగ్గలేదు. ఆ తర్వాత నితీష్‌ రాణా(9) నిష్క్రమించినా త్రిపాఠి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆ తర్వాత సునీల్‌ నరైన్‌ 17 (9),ఇయాన్‌ మోర్గాన్‌(7 ), రసెల్(2 ), పాట్‌ కమిన్స్‌ 17 (9), దినేశ్‌ కార్తీక్‌ 12 (11), విఫలం కావడంతో నిర్ణీత ఓవర్లలో 20 ఓవర్లలో 167 పరుగులకు ఆల్ ఔట్ అయ్యింది.

ఛేదనకు దిగిన చెన్నై జట్టులో ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌ (40 బంతుల్లో 50, ( 6 ఫోర్లు, 1 సిక్స్‌) ఒక్కడే రాణించాడు. మిగతా అంతా చేతులెత్తారు. డూప్లెసిస్(17), అంబటి రాయుడు 27 బంతుల్లో 30 పరుగులు, నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ కు వచ్చిన ధోని(11), సామ్ కరాన్(17), ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. పది పరుగుల తేడాతో ఓడిపోయింది. కోల్ కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో క్రీజులో ఉన్న కేదార్‌ జాదవ్‌(7), రవీంద్ర జడేజా(21)లు చెన్నైని గెలిపించలేకపోయారు. దీంతో చెన్నై విజయానికి 10 పరుగుల దూరంలో ఆగిపోయింది.

* చెన్నై బౌలర్లలో బ్రేవో 3, శార్దూల్‌ ఠాకూర్‌, కరణ్‌ శర్మ,శామ్‌ కర్జన్‌ తలా రెండు వికెట్లు తీశారు.

* తాజా విజయంతో కేకేఆర్‌ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. చెన్నై ఐదో స్థానానికి పడిపోయింది.

* గంభీర్ హయాం నుంచి ఓపెనర్ గా వస్తున్న నరైన్ చాలా ఏళ్ల తర్వాత నాలుగో స్థానంలో బ్యాటింగ్ లోకి వచ్చాడు.

* వరుసగా ఐదో మ్యాచ్ లో కూడా కెప్టెన్ దినేష్ కార్తీక్ విఫలం అయి విమర్శల పాలవుతున్నాడు.

* టీం ఇండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ కేదార్ జాదవ్ కూడా చెన్నై జట్టులో ఘోరంగా విఫలం అవుతున్నాడు.