Begin typing your search above and press return to search.

బ‌ద్ధ శ‌త్రువుకు రాహుల్‌గాంధీ ఇన్విటేష‌న్‌... రీజ‌న్ ఇదే!

By:  Tupaki Desk   |   30 Dec 2022 2:58 PM GMT
బ‌ద్ధ శ‌త్రువుకు రాహుల్‌గాంధీ ఇన్విటేష‌న్‌... రీజ‌న్ ఇదే!
X
ఆమె బీజేపీ ఫైర్‌బ్రాండ్‌. నోరు విప్పితే.. కాంగ్రెస్‌పై నిప్పులు కురిపిస్తారు. రాహుల్‌ను ప‌ప్పు అంటూ.. గ‌తంలో వ్యాఖ్యానించి.. ర‌చ్చ ర‌చ్చ చేశారు. అంతేకాదు.. అమేధీలో రాహుల్‌ను 2019 ఎన్నిక‌ల్లో చిత్తు చిత్తుగా ఓడించారు. ఇదే విష‌యాన్ని ఆమె ప్ర‌స్తావిస్తూ.. ``రాహుల్ మా(మ‌న‌సులో `నా`) దెబ్బ‌కు వైనాడ్(కేర‌ళ‌)కు పారిపోయాడు`` అని కామెంట్లు కుమ్మ‌రించారు. ఆమే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. ఇప్పుడు అలాంటి నాయ‌కురాలికి ఇప్పుడు రాహుల్ ప్ర‌త్యేక ఆహ్వానం పంపించారు.

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర లో పాల్గొనాలని ఇరానీకి ఆహ్వానం అందింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ నేత దీపక్ సింగ్ పార్టీ తరఫున ఈ ఆహ్వానం పంపారు. గౌరిగంజల్‌లోని స్మృతి ఇరానీ కార్యాలయంలో ఆమె కార్యదర్శి నరేష్ శర్మకు లేఖ అదించారు.

రాహుల్ యాత్రకు ప్రముఖులందరినీ ఆహ్వానించాలని పార్టీ సీనియర్ నేతలు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈనెల 28న మంత్రి క్యాంప్ కార్యాలయానికి స్వయంగా వెళ్లి ఆమె కార్యదర్శికి ఆహ్వాన పత్రిక అందించానని దీపక్ సింగ్ తెలిపారు. ఆయన తన లేఖను తీసుకుని ఎంపీకి అందజేస్తామని చెప్పినట్టు వివరించారు.

స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ఆహ్వానంపై బీజేపీ నేత దుర్గేష్ త్రిపాఠి స్పందించారు. ఆహ్వానించడం వరకే వాళ్ల (కాంగ్రెస్) పని అని అన్నారు. ''బీజేపీ ఎప్పుడు పనిచేసినా దేశ సమైక్యత కోసమే పనిచేస్తుంది. దేశం ముక్కలు కావడం అనే ప్రసక్తే లేనప్పుడు సమైక్యం చేయడం అనే ప్రసక్తి ఎలా వస్తుంది? ఏమి ముక్కలైందని యాత్రలో చేరాలి? అంపశయ్యపై ఉన్న కాంగ్రెస్‌ను పునరుద్ధరించేందుకు రాహుల్ గాంధీ ఈ యాత్ర చేపట్టారు. దానికి భారత్ జోడో యాత్ర అనే పేరు పెట్టారు'' అని ఆయన వ్యాఖ్యానించారు.

మూడు సార్లు ఎంపీగా ఉన్న రాహుల్‌ గాంధీని 2019 లోక్‌సభ ఎన్నికల్లో స్మృతి ఇరానీ ఓడించిన విషయాన్ని ఆయన గుర్తుచే శారు. అంతేకాదు.. ప్ర‌జ‌ల చేతిలో ఓడిన నాయ‌కుడిగా ఆయ‌న గుర్తింపు పొందారని అన్నారు. కాగా, రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర జనవరి 3న ఘజియాబాద్‌ మీదుగా ఉత్తరప్రదేశ్‌లోకి అడుగుపెట్టనుంది


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.