Begin typing your search above and press return to search.

ఉత్తరాంధ్రా మీద దండయాత్ర...చంద్రబాబుదే బాధ్యత ?

By:  Tupaki Desk   |   9 Sep 2022 12:58 PM GMT
ఉత్తరాంధ్రా మీద దండయాత్ర...చంద్రబాబుదే బాధ్యత ?
X
ఏపీలో మళ్ళీ హాట్ టాపిక్ గా అమరావతి రాజధాని ఇష్యూ వస్తోంది. ఎన్నికలకు ఏణ్ణర్ధం వ్యవధి ఉన్న నేపధ్యంలో ఈ టాపిక్ ని కనుక జనంలో హైలెట్ చేస్తే విపక్ష టీడీపీకి అది రాజకీయంగా బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుంది అన్న ఆలోచన ఉంది. ఏపీలో మూడున్నర వైసీపీ ఏలుబడిలోఏ కోశానా చూసుకున్నా రాజధాని అంటూ లేకుండా చేశారని తెలుగుదేశం పార్టీ సహా అన్ని పార్టీలు అరోపిస్తున్నాయి. ఇక మరో వైపు మూడు రాజధానులు అంటూ వైసీపీ ఎంత హడావుడి చేసినా అది చిక్కుముళ్ళ మధ్యన ఇరుక్కుని ఉంది.

దాంతో మూడు లేని చోట ఒక రాజధాని బెటర్ అన్న ఆలోచన మెల్లగా జనాలలో ఉంది అంటున్నారు. దానికి సానపట్టి ప్రజాభిప్రాయాన్ని మొత్తం అమరావతికి అనుకూలంగా చేసేందుకు భారీ పాదయాత్ర ఒకటి అమరావతి రైతులు మొదలెడుతున్నారు. ఈ నెల 12 నుంచి ఈ మహా పాద‌యాత్ర స్టార్ట్ అవుతోంది

ఇది ఏకంగా అమరావతి టూ అరసవల్లి దాకా సాగుంది. అంటే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అరసవల్లి వరకూ ఈ యాత్ర అన్న మాట. ఇలా కోస్తా జిల్లాలను, గోదావరి జిల్లాలను దాటుకుని ఉత్తరాంధ్రా గుండా సాగే ఈ యాత్ర రాజకీయంగా చాలా కీలకం అయినది. గతంలో అమరావతి రైతులు పాదయాత్రను రాయలసీమ దాకా చేపట్టారు.

ఇపుడు ఉత్తరాంధ్రాను మొత్తం టచ్ చేస్తున్నారు. విశాఖను పరిపాలనా రాజధాని అని జగన్ సర్కార్ డిసైడ్ చేసింది. ఏవో కారణాల వల్ల అది ఆగినా కూడా వైసీపీ పట్టు మాత్రం విడవడంలేదు. దాంతో ప్రజలు అంతా అమరావతికే కట్టుబడి ఉన్నారు అని చెప్పే ప్రయత్నం కూడా ఈ మహా పాద‌యాత్ర ద్వారా కనిపిస్తోంది. ఒక విధంగా చెప్పాలీ అంటే ప్రస్తుత ప్రభుత్వం మూడుకు మూడ్ కి వ్యతిరేకంగానే ఈ యాత్ర అనుకోవాలి

ఈ యాత్ర వల్ల జనాభిప్రాయం ఏ మాత్రం మారినా అది విపక్షాలకు ప్రత్యేకించి తెలుగుదేశానికి మహా లాభం. అదే టైం లో అధికార వైసీపీకి తీరని నష్టం. మరి ఏణ్ణర్ధంలో ఎన్నికలు ఉండగా ఇలా రాజకీయ నష్టం కలిగిస్తే వైసీపీ ఊరుకుంటుందా అన్నది ఒక చర్చ. అదే టైం లో జగన్ మాసన పుత్రికలు అయిన మూడు రాజధానులకు వ్యతిరేకంగా సాగే పాదయాత్ర యాత్ర కూడా ఇదే.

దాంతో ఈ యాత్ర సాఫీగా సాగుతుందా అన్న చర్చ అయితే ఇప్పటికే బయల్దేరింది. దానికి మరింతగా అనుమానాలు కలిగేలా ఏకంగా విశాఖకు చెందిన వైసీపీ మంత్రి గుడివాడ అమరనాధ్ ఉత్తరాంధ్రా మీద అక్కడ ప్రజల మీద ఇది దండయాత్ర అని గట్టిగానే మాట్లాడరు. విశాఖను పాలనారాజధానిగా చేయాలని వైసీపీ ఈ రోజుకీ కట్టుబడి ఉందని చెప్పారు.

విశాఖకు రాజధాని వద్దు అంటూ సాగే పాదయాత్ర వల్ల ఏవైనా జరిగి శాంతిభద్రతలకు ముప్పు వస్తే దానికి టీడీపీ అధినేత చంద్రబాబు బాధ్యత వహించాలని కూడా మంత్రి గారు అంటున్నారు. అంటే ఉత్తరాంధ్రాలో మాత్రం పాదయాత్ర సాఫీగా సాగదు అని ముందస్తు సంకేతాలు ఆయన ఇచ్చారా లేక అలాంటి వాతావరణం ఉందని ఊహించి హెచ్చరిస్తున్నారా అన్నది ఇక్కడ చూడాలి.

ఏది ఏమైనా విశాఖ రాజధాని కాదు అమరావతే మన రాజధాని అంటూ అక్కడి రైతులు ఉత్తరాంధ్రా వీధులలో తిరిగితే సగటు జనాల స్పందన ఎలా ఉన్న రాజకీయ స్పందన మాత్రం గట్టిగానే ఉంటుంది అంటున్నారు. ఎందుకంటే అమరావతి రైతుల పాదయాత్రకు ఎటూ విపక్షం మద్దతు ఉంటుంది. మరి కౌంటర్ గా అధికార పక్షం నుంచి ఏమైనా సవాల్ ఎదురైతే అపుడు రాజకీయం కాస్తా రసకందాయంలో పడుతుంది. పైగా అది రాజధాని రచ్చకు కూడా దారితీసే అవకాశం ఉంటుంది. చూడాలి మరి అమరావతి రైతుల పాదయాత్ర మాటున సాగే రాజకీయ సమరాలు సవాళ్ళూ ఈ యాత్రను ఏ తీరానికి చేరుస్తాయో.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.