Begin typing your search above and press return to search.

వారిద్దరికి 70 ప్లస్.. ఈ వయసులో పెళ్లి.. ఎలా చేసుకున్నారో తెలిస్తే అవాక్కే

By:  Tupaki Desk   |   10 Oct 2021 3:46 AM GMT
వారిద్దరికి 70 ప్లస్.. ఈ వయసులో పెళ్లి.. ఎలా చేసుకున్నారో తెలిస్తే అవాక్కే
X
అవును.. వారిద్దరికి 70 ప్లస్ వయసు. ఇలాంటి వేళలో.. ఎప్పుడు పోతామో అన్న భయంతో బతికేస్తుంటారు చాలామంది. అందుకు భిన్నంగా ఉన్నన్ని రోజులు ఆనందంగా.. తమకు నచ్చినట్లుగా.. తాము కోరుకున్నట్లుగా బతకాలని ఫీలయ్యే వారు కొందరుంటారు. ఇప్పుడు చెప్పే ఉదంతం ఆ కోవకు చెందిన వారే. 70ప్లస్ వయసులో.. ఒక జంట పరిచయం కావటం.. వారిద్దరి మధ్య ప్రేమ పుట్టి.. పెళ్లి చేసుకోవటం వరకు వెళ్లటం ఒక ఎత్తు అయితే.. దీనంతటికి కారణం.. ఒక డేటింగ్ యాప్ కావటం మరో విశేషంగా చెప్పాలి. ఈ వెరైటీ లవ్ స్టోరీలోకి వెళితే..

పెయింటర్ కమ్ రిటైర్డ్ ప్రొఫెసర్ జిమ్ ఆడమ్స్ కు పెళ్లై 38 సంవత్సరాల తర్వాత నాలుగేళ్ల క్రితం తన భార్యను కోల్పోయారు. ఆ వేదనలో ఉన్న వేళలోనే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టేసింది. లాక్ డౌన్ వేళ.. తనకో తోడు కావాలని ఆయన బలంగా కోరుకున్నారు. దీంతో.. యాభై ఏళ్లు పైబడిన మహిళ కోసం ఆన్ లైన్ డేటింగ్ యాప్ లో లాగిన్ అయ్యారు.

అలా తోడు వెతుక్కుంటున్న వేళ.. ఆయనకు 79 ఏళ్ల రిటైర్డ్ ఇన్సూరెన్స్ బ్రోకర్ ఆడ్రీని కలిశారు. ఆమె దాదాపు 33 ఏళ్ల క్రితం విడాకులు తీసుకొని ఒంటరిగా బతుకుతోంది. అనుకోనిరీతిలో మొదలైన వారి పరిచయం.. చాలా తక్కువ కాలంలోనే ప్రేమగా మారటమే కాదు.. అది పెళ్లి పీటల వరకు వెళ్లింది. ఒకరికొకరు నచ్చటంతో పెళ్లికి సిద్ధమయ్యారు. డేటింగ్ యాప్ ను వాడటం మొదలు పెట్టిన తక్కువ రోజులకే తమ పరిచయం జరిగిందని.. ఇద్దరం కలవటానికి ఎక్కువ టైం తీసుకోలేదని వారు చెబుతున్నారు. గత నెల 25న వారిద్దరూ ఒకటయ్యారు. ప్రేమ జంట కాస్తా కొత్త పెళ్లి జంటగా మారటం.. వీరి పెళ్లిని నెట్టింట వైరల్ గా మారటమే కాదు.. లక్షలాది లైకులు వచ్చి పడుతున్నాయి. నిజమే.. ఈ వయసులో వారి ప్రేమను.. పెళ్లికి అల్ ద బెస్ట్ చెప్పాల్సిందే. వీరి ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మీరూ ఒక లుక్కేయండి.