Begin typing your search above and press return to search.
కరోనా వ్యాప్తి పై ఇంటర్ పోల్ హెచ్చరిక..ఏంచెప్పిందంటే?
By: Tupaki Desk | 22 Nov 2020 2:20 PM ISTకరోనా మహమ్మారి ఏ విధంగా వ్యాప్తి చెందుతుందో , ఎప్పుడు ఎవరికి సోకుతుందో ఎవ్వరం చెప్పలేని పరిస్థితి. ప్రముఖులు , రాజకీయనేతలు , సామాన్యులు ఇలా ప్రతి ఒక్కరు కూడా కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా విజృంభణ పెరుగుతుంది. ఈ సమయంలో అంతర్జాతీయ నేర పోలీసు సంస్థ ఇంటర్ పోల్ హెచ్చరిక జారీ చేసింది. పార్శిల్స్, లెటర్ల నుంచి కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీచేసింది. ప్రముఖులు, రాజకీయ వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని కరోనా వ్యాప్తి చేసే ప్రమాదం ఉందని ఇంటర్ పోల్ వెల్లడించింది. ప్రత్యేకించి పార్శిల్స్, వైరస్ అంటించిన లెటర్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
తాజా మార్గదర్శకాల ప్రకారం.. ఇంటర్ పోల్, ఇండియాతో సహా అన్ని చట్ట అమలు సంస్థలను పర్యవేక్షణను మరింత పటిష్టం చేసేలా సంబంధిత సంస్థలను హెచ్చరించాలని సూచించింది. కొంతమంది దుర్మార్గులు ఉద్దేశపూర్వకంగానే పోలీసులపై, నిఘా అధికారులు, భద్రతా అధికారులు, డాక్టర్లకు దగ్గరగా వెళ్లి వారిపై తుంపర్లు పడేలా తుమ్మడం, దగ్గడం చేస్తున్నారు. అలాగే కరోనా కలుషితమైన లేఖలు, పార్శిల్స్ ను రాజకీయ వ్యక్తులకు పంపించే కుట్రలు పన్నుతున్నారని నిఘా వర్గాలకు సమాచారం అందింది. వెంటనే అలర్ట్ అయిన ఇంటర్ పోల్ 194 సభ్యదేశాలకు సూచనలు ఇస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది.
వ్యక్తిగత రక్షణ, క్లీనింగ్ ఉత్పత్తుల కోసం మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో నేరగాళ్లు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతో కరోనా మహమ్మారి వ్యాప్తికి కారణమవుతోంది. మార్చి 2020 నుంచి భాగస్వాములతో కలిసి ఇంటర్ పోల్ ఆపరేషన్ పాంగీయా నిర్వహించింది. ఇందులో నకిలీ సర్జరీ మాస్క్ లు, హ్యాండ్ శానిటైజర్లు, యాంటీవైరల్, యాంటీ మలేరియల్ మందులు, టీకాలు,కరోనా టెస్ట్ కిట్లు ఉన్నాయని ఇంటర్ పోల్ మార్గదర్శకాల్లో పేర్కొంది. అనుమానిత పార్శిల్స్, లేటర్లను జాగ్రత్తగా చెకింగ్ చేయాలని ఇంటర్ పోల్ పలు సూచనలు చేసింది.