Begin typing your search above and press return to search.
ఫోన్ బిల్లు కట్టక ఏపీలోని ఆ శాఖకు ఇంటర్నెట్ కట్?
By: Tupaki Desk | 2 July 2021 10:00 AM ISTఏపీ సమాచార.. పౌర సంబంధాల శాఖకు సంబంధించిన వెలుగు చూసిన ఒక వైనం సంచలనంగా మారింది. దాదాపు రూ.2.30లక్షల కోట్లు ఉన్న రాష్ట్ర బడ్జెట్ లో ఒక ప్రభుత్వ విభాగానికి చెందిన రూ.18 లక్షల ఫోన్ బిల్లును పెండింగ్ లో ఉంచటం.. ఎంతకూ డబ్బు చెల్లించట్లేదన్న కారణాన్ని ఎత్తి చూపిస్తూ .. సేవల్ని నిలిపివేయటం షాకింగ్ గా మారింది. దీనికి సంబంధించిన సమాచారం అవాక్కు అయ్యేలా చేస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే వివిధ సంక్షేమ పథకాలకు నిత్యం కోట్లాది రూపాయిల ఖర్చు చేస్తూ భారీ ప్రకటనలు ఇచ్చే సమాచార శాఖ.. తమ ఫోన్ బిల్లుల్ని కట్టుకునే పరిస్థితుల్లో లేదన్న మాట ఇప్పుడు షాక్ కు గురి చేస్తోంది. ప్రభుత్వం తరఫున వందల కోట్ల రూపాయిల్ని ఖర్చు చేస్తూ మీడియాలో ప్రకటనలు ఇచ్చే ఈ శాఖ.. తన ఉద్యోగుల అవసరాల కోసం ఖర్చు పెట్టలేని దీన స్థితిలో ఉందా? అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే.. ఇందులో వాస్తవం లేదన్న మాట వినిపిస్తోంది. మరోవైపు 13 జిల్లాల్లోని సమాచార శాఖకు సంబంధించి ఫోన్.. ఇంటర్నెట్ బిల్లు రూ.18లక్షలు పెండింగ్ లో ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది.
సకాలంలో బిల్లును చెల్లించకపోవటంతో ఫిబ్రవరిలోనూ రాష్ట్రంలోని సమాచార శాఖ కార్యాలయాల్లోని ఫోన్లు..ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు.తాజాగా మరోసారి అలాంటి పరిస్థితి నెలకొందన్న మాట వినిపిస్తోంది. ప్రస్తుతం ఇన్ కమింగ్ సర్వీసు మాత్రమే ఉందని.. వారం వ్యవధిలో బిల్లు చెల్లించని పక్షంలో ఆ సేవల్ని కూడా నిలిపివేస్తామని టెలికం కంపెనీలు తాఖీదులు ఇస్తున్నాయని చెబుతున్నారు. అయితే.. ఇందులో ప్రభుత్వం తప్పు కంటే కూడా ఆశాఖకు చెందిన అధికారుల నిర్లక్ష్యమే ఎక్కువగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.