Begin typing your search above and press return to search.

అంతర్జాతీయ రాకపోకలపై మరోసారి నిషేధం విధించాలి

By:  Tupaki Desk   |   1 Nov 2020 4:41 PM GMT
అంతర్జాతీయ రాకపోకలపై మరోసారి నిషేధం విధించాలి
X
అమెరికా, యూరప్ దేశాల్లో కరోనా రెండో వేవ్ మొదలైంది. దీంతో అక్కడ రోజుకు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. అన్ లాక్ తో విదేశాల నుంచి విమాన రాకపోకలను కేంద్రం అనుమతించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అమెరికా నుంచి రాకపోకలు ఆపాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే మొదలైంది. సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ కరోనా కాలంలో భారతదేశం - యుఎస్ఎ మధ్య విమానాల రాకపోకాలు నిలిచిపోవడంపై చాలా మంది పౌరులు బాధపడుతున్నారు. అమెరికాలో రెండో వేవ్ మొదలైందని.. దేశానికి చేరకుండా విమానాలు కుదించాలని మరికొందరు సూచిస్తున్నారు.

అంతర్జాతీయ విమానాలను ఆపడం ద్వారా ఇతర దేశాల నుండి వైరస్ ను దేశానికి రాకుండా కట్టడి చేయవచ్చు. తద్వారా దేశంలో మళ్లీ వైరస్ వ్యాపించకుండా చేయవచ్చు. ఇలా చేసి కరోనాను సింగపూర్ వంటి దేశాలు అరికట్టాయి. ఆ దేశాలను చూసైనా భారతదేశం కరోనా వ్యాప్తిని నియంత్రించాలని పలువురు సూచిస్తున్నారు.

చాలా మంది భారతీయులు ఈ సింగపూర్ మోడల్‌ను భారతదేశంలో కూడా అనుకరించాలని కోరుతున్నారు. దీన్ని అమలు చేయని దేశాలు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయని సూచిస్తున్నారు.

మరో ఆందోళన ఏమిటంటే, అమెరికా నుంచి భారతదేశానికి ఎక్కువమంది ప్రయాణాలు చేస్తున్నారు. విమానాలలో రాకపోకలు ద్వారా మన దేశంలో ఈ వైరస్ వ్యాప్తి చెందితే కరోనా కేసులను నియంత్రించలేకపోవచ్చు. అప్పుడు పరిస్థితులు చేయిదాటి మళ్లీ లాక్ డౌన్ దిశగా దేశం వెళ్లొచ్చు.

ప్రపంచవ్యాప్తంగా రెండవ వేవ్ మొదలు కావడంతో ప్రభుత్వం -సంబంధిత అధికారులు అంతర్జాతీయ రాకపోకలపై మరోసారి నిషేధం విధించాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది.