Begin typing your search above and press return to search.

హైదరాబాద్ కు అంతర్జాతీయ గుర్తింపు..!

By:  Tupaki Desk   |   18 Feb 2021 8:00 PM IST
హైదరాబాద్ కు అంతర్జాతీయ గుర్తింపు..!
X
హైదరాబాద్​కు మరో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. ఐక్యరాజ్యసమితితో అనుబంధంగా పనిచేసే అర్బోర్​ డే ఫౌండేషన్​ హైదరాబాద్​ను ‘టీ సిటీ ఆఫ్​ ద వరల్డ్​’ గా ఎంపిక చేసింది. దేశంలో ఏ నగరానికి ఇప్పటివరకు ఈ పురస్కారం దక్కలేదు. పర్యావరణాన్ని కాపాడటంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని ఈ సంస్థ కొనియాడింది. ఒక్క హైదరాబాద్ నగరంలో 2 కోట్ల 40 లక్షల మొక్కలు నాటడం గొప్ప విషయమని కొనియాడింది.
ఈ అంశంపై రాష్ట్ర మంత్రి కేటీఆర్​ ట్విట్టర్​ వేదికగా స్పందించారు.

సీఎం కేసీఆర్​ చేపట్టిన హరితహారం కార్యక్రమం వల్లే భాగ్యనగరానికి ఈ ఘనత దక్కిందని ఆయన కొనియాడారు. సీఎం కేసీఆర్​ మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ మీద ఎంతో ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ‘హరితహారం’ అనే కార్యక్రమాన్ని చేపడుతున్నది. ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతున్నది. మరోవైపు ఎంపీ సంతోష్​కుమార్​ కూడా గ్రీన్​ చాలెంజ్​ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా ఎందరో సెలబ్రిటీలు ప్రతిరోజు మూడు మొక్కలు నాటుతున్నారు.

మరోముగ్గురికి గ్రీన్​ చాలెంజ్​ విసురుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్నది. ఇదిలా ఉంటే కేసీఆర్​ బర్త్​ డే సందర్భంగా నిన్న టీఆర్​ఎస్​ కార్యకర్తలు, కేసీఆర్​ అభిమానులు, మంత్రులు, ముఖ్య నేతలు రాష్ట్ర వ్యాప్తంగా విరివిగా మొక్కలు నాటారు.స్వయంగా సీఎం కేసీఆర్​ కూడా ఫామ్​హౌస్​లో రుద్రాక్ష మొక్కను నాటారు.