Begin typing your search above and press return to search.

కేసీఆర్ మనవడికి అంతర్జాతీయ అవార్డ్

By:  Tupaki Desk   |   29 Jun 2021 3:46 AM GMT
కేసీఆర్ మనవడికి అంతర్జాతీయ అవార్డ్
X
తాతకు తగ్గ మనవడుగా హిమాన్షు నిరూపించుకున్నాడు. పట్టుమని పదిహేనేళ్లు కూడా లేని కేసీఆర్ మనవడు సాధించేశాడు. తాత కేసీఆర్ సీఎంగా ఉండడం.. నాన్న కేటీఆర్ మంత్రిగా ఉండడంతో వారి ప్రోద్బలంతో అద్భుతమే చేశాడు.

కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు 2021 సంవత్సరానికి గాను ‘డయానా’ అంతర్జాతీయ పురస్కారం దక్కింది. బ్రిటన్ రాజకుమారి ‘డయానా’ పేరిట ప్రతి సంవత్సరం సమాజ సేవ చేస్తున్న 9-25 ఏళ్లలోపు వారికి ఈ అవార్డు ఇస్తారు. హిమాన్షు చేపట్టిన ప్రాజెక్టుకు మెచ్చి ఈ అంతర్జాతీయ అవార్డు దక్కింది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసి ఆనందం వ్యక్తం చేశఆడు.

హిమాన్షు ‘శోమ’ అనే పేరుతో తన తాత, సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లో రెండు గ్రామాల రూపు రేఖలుమార్చాడు. గంగాపూర్, యూసుఫ్ ఖాన్ పల్లి గ్రామాల స్వయం సంవృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టారు. గజ్వేల్ లోని ఈ రెండు గ్రామాల్లో కల్తీలేని ఆహార పదార్థాలు తయారు చేసే పరిశ్రమను స్థాపించారు. పరిశ్రమకు కావాల్సిన ముడిపదార్థాలను సేకరించడం.. వాటిని ప్రాసెసింగ్ చేయటం.. ప్యాకింగ్ చేయడం వంటి బాధ్యతలన్నీ గ్రామస్థులకు అప్పగించారు. ఐక్యరాజ్యసమితి నిర్ధేశించిన 17 లక్ష్యాలను హిమాన్షు ప్రాజెక్టు సాధించింది.

హిమాన్షు ప్రాజెక్టు డయానా అవార్డుకు ఎంపికైంది. ఈ అవార్డును ఆన్ లైన్ లోనే హిమాన్షు స్వీకరించనున్నారు. ఇక తన ప్రాజెక్టుకు సహకరించిన తాత కేసీఆర్ కు ఈ సందర్భంగా హిమాన్షు ధన్యవాదాలు తెలిపారు.