Begin typing your search above and press return to search.

భూసేకరణ అంటే చాలు రచ్చ చేస్తున్నారు..

By:  Tupaki Desk   |   9 April 2015 10:51 AM GMT
భూసేకరణ అంటే చాలు రచ్చ చేస్తున్నారు..
X
ఏపీలో భూసేకరణ అనేది రచ్చ వ్యవహారంగా మారుతోంది. ప్రభుత్వం ఎంత మంచి ప్యాకేజీ ఇస్తున్నా విపక్షాలు ప్రజలను రెచ్చగొట్టి అల్లరి చేస్తున్నాయి. ఇప్పటికే ఏపీ రాజధానిలో భూములు స్వచ్ఛందంగా ఇచ్చేందుకు రైతులు ముందుకొచ్చినా విపక్షాలు కల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విజయనగరం జిల్లా భోగాపురం వద్ద విమానాశ్రయం ఏర్పాటుకు సంబందించి భూములు సేకరణనూ విపక్షాలు రచ్చరచ్ఛ చేసే ప్రయత్నం చేస్తున్నాయి.

తాజాగా భోగాపురం మండలం చాకివలస గ్రామంలో భూములు సేకరించడానికి అదికారులు సమావేశం ఏర్పాటు చేయగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రైతుల నినాదాలతో సమావేశం రసాభాసగా మారింది. విమానాశ్రయం ఏర్పాటుకు భూములిస్తే కేంద్రం మెరుగైన ప్యాకేజీ ఇస్తుందని అధికారులు వివరించినా రైతులు వినలేదు. నిజానికి అంతర్జాతీయ విమానాశ్రయం వెనుకబడిన విజయనగరం జిల్లాకు రావడానికి కారణం కేంద్ర మంత్రి అశోక్‌. కేంద్రంలో విమానయాన శాఖ మంత్రిగా ఉన్న ఆయన సొంత జిల్లా అభివృద్ధి కోరుకుంటూ భోగాపురానికి విమానాశ్రయాన్ని తేగలిగారు. ఆ శాఖ మంత్రిగా ఆయనే ఉండడంతో రైతులకు మంచి పరిహారం ఇప్పిస్తారనడంలోనూ ఎలాంటి అనుమానం లేదు. ఇదంతా అనుకున్నట్లుగా జరిగితే అశోక్‌ కు మంచి మైలేజి రావడం గ్యారంటీ.

అయితే... విజయనగరం జిల్లాకే చెందిన ఓ సీనియర్‌ కాంగ్రెస్‌ లీడర్‌, కొందరు వైసీపీ నేతలు అశోక్‌ కు క్రెడిట్‌ దక్కకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ కారణంగా భోగాపురం విమానాశ్రయానికి జరిపే భూసేకరణను సజావుగా సాగకుండా అవరోధాలు సృష్టించాని ప్లాన్‌ చ్స్తేున్నట్లు తెలుస్తోంది.