Begin typing your search above and press return to search.

మతాంతర వివాహాలు చట్టబద్ధం..ఆపే హక్కు ఎవరికి లేదు..అలహాబాద్​ కోర్టు సంచలన తీర్పు..!

By:  Tupaki Desk   |   9 Jan 2021 6:30 PM IST
మతాంతర వివాహాలు చట్టబద్ధం..ఆపే హక్కు ఎవరికి లేదు..అలహాబాద్​ కోర్టు సంచలన తీర్పు..!
X
యువతీ యువకులు మేజర్లు అయినప్పుడు కులాలు, మతాలతో సంబంధం లేకుండా వాళ్లు పెళ్లి చేసుకోవచ్చని అలహాబాద్​ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. వాళ్ల వివాహాన్ని అడ్డుకొనే హక్కు ఎవరికీ లేదని కోర్టు స్పష్టం చేసింది. మతాంతర వివాహాలను రద్దు చేస్తూ ఇటీవల ఉత్తర్​ప్రదేశ్​, మధ్యప్రదేశ్​ ప్రభుత్వాలు చట్టాలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అలహాబాద్​ హైకోర్టు వెలువరించిన తీర్పు సంచలనంగా మారింది. రాజ్యాంగం ప్రకారం మేజర్లు అయిన యువతీ యువకులు పెళ్లి చేసుకోవచ్చని కోర్టు తెలిపింది. ఈ మేరకు జస్టిస్​ శ్రీవాస్తవ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం శనివారం తీర్పు చెప్పింది.


లక్నోకు చెందిన యువతి యువకులు ఇటీవల ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అయితే వీళ్లది మతాంతర వివాహం కావడంతో ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. ఈ క్రమంలో వాళ్లు కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. వాళ్లకు వెంటనే రక్షణ కల్పించాలని స్థానిక డీఎస్పీని కోర్టు ఆదేశించింది.

కుటుంబ సభ్యులను వదులుకుని వచ్చిన వధువుకు ఆమె ఆర్థికంగా అండగా నిలబడాలని ఆమె పేరు మీద రూ. 3లక్షలు జమ చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే ఇప్పటికే మధ్యప్రదేశ్​, ఉత్తరప్రదేశ్​ రాష్ట్రాలు మతాంతర వివాహాలను చెల్లవంటూ చట్టాలు తీసుకొచ్చాయి. ఈ ప్రభుత్వ చట్టాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది.