Begin typing your search above and press return to search.
పంజాబ్ పోరు.. చతుర్ముఖ పోటీలో విజేత ఎవరు?
By: Tupaki Desk | 27 Dec 2021 5:02 PM ISTమరో రెండు.. మూడు నెలల్లో (ఫిబ్రవరి - మార్చి) జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అందరి చూపు యూపీ మీదనే. ఆ తర్వాత అందరూ ఆసక్తిగా మాట్లాడుకునేది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల గురించే. గతానికి భిన్నంగా తాజా పరిస్థితులు ఉన్నాయి. తొలిసారి చతుర్ముఖ పోటీ జరిగే అవకాశం ఉండటం..ఎవరికి వారు తమకున్న అవకాశాల గురించి ఆత్మవిశ్వాసంతో ఉంటున్నారు. మరి.. ఇంతటి పోటీ వేళ.. ప్రజలు ఎవరి పక్షాన నిలుస్తారు? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ అధికారపక్షంగా ఉన్న ఈ సంపన్న రాష్ట్రంలో జరిగే ఎన్నికల ఫలితాలు 2021లో రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల ప్రభావం పక్కాగా పడనుంది.
కాంగ్రెస్ లో లుకలుకలు.. మోడీ సర్కారు అనుసరించిన విధానాలతో బీజేపీనేతలు కిందా మీదా పడుతుంటే.. ఒకప్పటి అధికారపక్షంగా ఉన్న అకాలీలు.. ఏడాదిగా పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నారు. ఈసారి అధికారపక్షంగా అవతరించేందుకు వారు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఢిల్లీ రాష్ట్ర అధికారపక్షమైన ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రంఈసారి పంజాబ్ లో అధికారాన్ని సొంతం చేసుకోవటం కోసం తెగ ప్రయత్నం చేస్తోంది.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా సుపరిచితుడైన మాజీ సీఎం అమరీందర్ సింగ్.. ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చేయటం.. లోక్ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీని పెట్టటం.. బీజేపీతో జత కట్టటంతో అంచనాలు ఎక్కువ అయ్యాయి. పార్టీల వారీగా ఉన్న బలాలు.. బలహీనతల్ని చూస్తే..
శిరోమణి అకాలీదళ్
పంజాబ్ అన్నంతనే గుర్తుకు వచ్చే పార్టీ శిరోమణి అకాలీదళ్. ప్రజలు ఇచ్చిన అపూర్వమైన అవకాశాన్ని చేజేతులారా చెడగొట్టుకున్న తప్పు వీరు చేశారు. తాము అధికారంలో ఉన్నవేళలో పంజాబ్ మొత్తం డ్రగ్స్ ఊబిలో చిక్కుకుపోయిందన్న అపవాదును మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో 2017లో జరిగిన ఎన్నికల్లో దారుణ పరాభవాన్ని మూటకట్టుకుంది. కేవలం ఆ పార్టీకి 15 సీట్లు మాత్రమే లభించి మూడో స్థానానికి పరిమితమైంది.
2020లో రైతులకు వ్యతిరేకంగా మోడీ సర్కారు తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల (ఈ మధ్యనే వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే) పై పెద్ద ఎత్తున నిరసనలు.. ఆందోళనలు వ్యక్తం కావటంతో పంజాబ్ రైతాంగంలో రగులుతున్న అసంతృప్తిని గుర్తించిన అకాలీదళ్ బీజేపీతో తనకున్న దోస్తీని తెగతెంపులు చేసేసుకుంది. పార్టీ అధ్యక్షుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్ సతీమణి హర్ సిమ్రత్ కౌర్ తన కేంద్రమంత్రి పదవికి సైతం రాజీనామా చేశారు. అనంతరం అకాలీలు సొంతంగా తమ బలాన్ని పెంచుకునేందుకు వీలుగా.. రాష్ట్ర జనాభాలో ఉన్న 32 శాతం దళితుల్ని లక్ష్యంగా చేసుకొని ఎత్తులు వేస్తున్నారు. ఇప్పటికే 91 స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించటం ద్వారా.. వారు నియోజకవర్గాల్లో స్వేచ్ఛగా పని చేసుకోవటానికి వీలు కలుగుతుంది.
బీఎస్పీ
గతంలో దళితుల ఓటు బ్యాంకును టార్గెట్ చేస్తూ బహుజన్ సమాజ్ వాదీ పార్టీ 111 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ 110 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతైన పరిస్థితి. ఓవైపు తనకెంతో కీలకమైన యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో యూపీ మీదనే ఆమె ఫోకస్ ఉంటుంది. అలాంటప్పుడు పంజాబ్ మీద ఆమె ఎంత ఆసక్తిని చూపుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
పంజాబ్ లోక్ కాంగ్రెస్ - బీజేపీ
పంజాబ్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న అమరీందర్ ను కాంగ్రెస్ పార్టీ పొమ్మనకుండా పెట్టిన తీరుతో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసిన ఆయన.. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో సొంత పార్టీ పెట్టుకున్నారు. సాగు చట్టాల్ని రద్దు చేస్తే తాను బీజేపీతో జత కలుస్తానని చెప్పిన ఆయన.. ఇప్పుడు మూడు చట్టాల్ని వెనక్కి తీసుకోవటంతో కమలనాథులతో కలిసే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే.. అదెంతవరకు వర్కుట్ అవుతుందో చూడాలి.
అకాలీదళ్ తో పొత్తుల్లో భాగంగా 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 23 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం మూడు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. 2019 లోక్ సభ ఎన్నికలకు వచ్చేసరికి పోటీ చేసిన మూడింటిలో రెండు నెగ్గింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అమరీందర్ కు ఎంతమేర కలిసి వస్తుందో చూడాలి.
కాంగ్రెస్
ఒకప్పుడు దేశంలోని అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. మారిన కాలంలో ఎన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నామన్న విషయాన్ని చప్పున చెప్పినా.. ఏయే రాష్ట్రాల్లో అంటే మాత్రం వెంటనే చెప్పలేని పరిస్థితి. అంత దారుణంగా పార్టీ పరిస్థితి మారింది. ఒత్తిడికి తలొగ్గి అమరీందర్ సింగ్ ను సీఎం కుర్చీ నుంచి దించేయటం.. కొత్త సీఎం విషయంలోనూ పీసీసీ చీఫ్ గా వ్యవహరిస్తున్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ అధిష్ఠానంపై ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఈసారి ఎన్నికల్లో గెలవటం కష్టమన్న మాట వినిపిస్తోంది.
ఆమ్ ఆద్మీ పార్టీ
కేజ్రీవాల్ నాయకత్వంలో పార్టీ పెట్టిన కొద్ది నెలలకే ఢిల్లీ రాష్ట్రాన్ని సొంతం చేసుకున్న అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీకి చుట్టుపక్కల ఉన్న కొన్ని రాష్ట్రాలకు పార్టీని విస్తరించాలన్న యోచనలో ఆయన ఉన్నారు. అందులో భాగంగా పంజాబ్ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టారు. గత ఎన్నికల్లో 20 స్థానాల్లో గెలిచిన ఆ పార్టీ 23.72శాతం ఓట్లను సొంతం చేసుకుంది. ఈసారి ఎన్నికల్లో విజయం సాధించటానికి వీలుగా గడిచిన ఐదేళ్లుగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.
ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కారు ప్రవేశ పెట్టిన పలు పథకాలు.. కార్యక్రమాలు సక్సెస్ కావటం.. ఢిల్లీ మోడల్ ను పంజాబ్ లోనూ అమలు చేస్తామన్న మాటతో పాటు.. సిక్కు నేతను తమ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిని చేస్తామన్న హామీ.. ఆ పార్టీకి అవకాశం ఉందంటున్నారు. మొత్తం 117 స్థానాలు ఉన్న పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే 73 మంది అభ్యర్థుల పేర్లను నాలుగు విడతల్లో ప్రకటించి.. మిగిలిన వారి కంటే ముందంజలో ఉంది. మరి.. ప్రజలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తారో చూడాలి.