Begin typing your search above and press return to search.
భారత్ తో రష్యాకున్న రిలేషన్ మీద అమెరికా ఆసక్తికర వ్యాఖ్యలు
By: Tupaki Desk | 27 Feb 2022 10:14 AM ISTప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేస్తోంది.. ఉక్రెయిన్ - రష్యాల మధ్య నడుస్తున్న పోరు. సైనిక చర్య పేరుతో సాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ తో పోలిస్తే రష్యా తిరుగులేని అధిక్యతను కనబరుస్తోంది. అయితే.. ఉక్రెయిన్ సైన్యం మాత్రం తుదికంటా అన్న రీతిలో పోరాడుతోంది.
ఇలాంటివేళ.. ఈ రెండు దేశాలతో భారత్ అనుసరించాల్సిన విధానాలపై పలు వ్యాఖ్యలు.. వాదనలు వినిపిస్తున్నాయి. మోడీ సర్కారు మాత్రం ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తోంది. సైనిక చర్య మొదలైన కొన్ని గంటల వ్యవధిలోనే.. రష్యా అధినేత పుతిన్ తో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ లో మాట్లాడిన వైనం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ కు అండగా నిలుస్తామని చెప్పిన అగ్రరాజ్యం అమెరికా తీరు ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. ఇదిలా ఉంటే.. రష్యాతో భారత్ కున్న సంబందాలపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆడ్మినిస్ట్రేషన్ కీలక వ్యాఖ్యలు చేసింది. రష్యాతో భారత్ కున్న రిలేషన్ భిన్నమైనదని పేర్కొంది. కచ్ఛితంగా అమెరికాతో భారత్ తో అలాంటి రిలేషన్ లేదని వ్యాఖ్యానించటం గమనార్హం. అమెరికాకు భారత్ సన్నిహిత దేశమే అయినా.. రష్యాతో ఉన్న సంబంధాలు భిన్నమైనవని వ్యాఖ్యానించారు.
భారత్ కు రష్యాతో రక్షణ.. భద్రత సంబంధాలతో పాటు అనే విధాలుగా సంబంధాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. అంతర్జాతీయ వ్యవస్థను పరిరక్షించేందుకు తమ పలుకుబడిని ఉపయోగించాలని రష్యాతో సంబంధాలున్న ప్రతి దేశాన్ని తాము కోరినట్లుగా పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలు చూస్తే.. పుతిన్ మీద ఒత్తిడి తెచ్చేందుకు.. భారత ప్రధాని నరేంద్ర మోడీ మీద అమెరికా ఒత్తిడి తెస్తుందా? అన్న సందేహాలు వ్యక్తం కాక మానవు. అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ మీడియాతో మాట్లాడుతూ.. తమకు భారత దేశంతో చాలా ముఖ్యమైన సంబంధాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు.
రష్యాతో భారత్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా పేర్కొన్న ఆయన.. అమెరికాతో భారత్ కు ఉన్న సంబంధాలతో పోలిస్తే.. రష్యాతో భిన్నమైన అనుబంధం ఉందని పేర్కొన్నారు. రష్యాతో భారత్ కు సంబంధాలు ఉన్నాయి.. అలాంటివి కచ్ఛితంగా మాకు లేవు. రక్షణ.. భద్రత రంగంతో సహా వివిధ రంగాల్లో భారత్ - రష్యాకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయన్న వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.