Begin typing your search above and press return to search.

ఇంట్రెస్టింగ్... పాక్ దేశద్రోహికి భారత పద్మం

By:  Tupaki Desk   |   14 Nov 2021 2:34 PM GMT
ఇంట్రెస్టింగ్... పాక్ దేశద్రోహికి భారత పద్మం
X
ఒక దేశంకు సంబంధించిన సైనిక సమాచారాన్ని పక్క దేశం అదీ కాకుండా శత్రు దేశానికి ఇవ్వడం అంటే మాములు విషయం కాదు. మన సైనికులు పలు సార్లు పాక్ సైనికులకు పట్టుబడ్డ సమయంలో కనీసం చిన్న విషయాన్ని కూడా కొందరు తిరిగి వచ్చారు.. మరి కొందరు అక్కడే ప్రాణాలను వదిలారు. అద్భుత పోరాట పటిమ కనబర్చే సైనికులకు సేవా పురష్కారాలు దక్కుతాయి. కానీ తాజాగా భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఒక దేశద్రోహి కి పద్మ శ్రీ అవార్డ్ దక్కింది. అయితే ఆ దేశద్రోహి పాక్ వ్యకి కావడం ఇక్కడి ప్రత్యేకత.. అతడి దేశ ద్రోహం ఒక దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది. అందుకే అతడు పద్మ అవార్డు ను అందుకునే అంతటి గొప్ప వ్యక్తి అయ్యాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే... పాకిస్తాన్ ఆర్మీ జవాన్ అయిన ఖాజీ సజ్జద్ అలీ జహీర్ 1970 ల్లో దొంగ చాటుగా పాక్ నుండి భారత్ లో ప్రవేశించాడు. ఆ సమయంలో అతడిని భారత సైన్యం బంధించింది. అతడు పాకిస్తాన్ ఉగ్రవాద అని.. పాక్ గూఢచారి అని భారత సైన్యం అనుమానించింది. కానీ అతడు చెప్పిన విషయాలు విని అతడిపై కాస్త నమ్మకం కలిగింది. తాను పాకిస్తాన్ సైనికుడిని అని.. అక్కడి వారు చేస్తున్న అకృత్యాలు చూడలేక తాను మనసు చంపుకుని అక్కడ పని చేయలేక ఇక్కడికి వచ్చినట్లుగా చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ ఆర్మీ వారు అత్యంత దారుణంగా స్థానిక మహిళలపై అఘాయితాలకు పాల్పడుతూ సామాన్య జనాలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఆ విషయంలో ఆర్మీ ఉన్నతాధికారులు కూడా పట్టించుకోక పోవడం తో తాను ఆ ఘోరాలను చూడలేక ఇటు వచ్చాను అన్నాడు.

ఆ సమయంలో అతడి వద్ద పాక్ ఆర్మీ కి సంబంధించిన పలు కీలక సమాచార పాత్రలు కూడా ఉన్నాయి. వాటిని అతడు పాయింట్ లో పెట్టుకుని బోర్డర్ దాటాడు. ఆ సమయంలో సజ్జద్ ను పాకిస్తాను దేశ ద్రోహిగా ముద్ర వేసింది. సజ్జద్ తీసుకు వచ్చిన పాక్ ఆర్మీ సమాచారం వల్ల బంగ్లా దేశ్ విముక్తి యుద్ధంలో భారత్ చాలా ఈజీగా పాక్ పై గెలుపొందింది. అప్పటి నుండి సజ్జద్ కు భారత్ సముచిత స్థానం కల్పించింది. అతడికి భారత పౌరసత్వం కూడా ఇచ్చింది. అప్పటి ఆయన త్యాగం కు గుర్తుగా ఇప్పుడు మోడీ ప్రభుతం అతడిని పద్మ శ్రీ అవార్డ్ తో సత్కరించింది. ఇది నిజంగా అభినందించాల్సిన విషయం. ఆ దేశ ద్రోహి కి ఇక్కడ గొప్ప అవార్డ్ ప్రదానం చేయడం మన దేశానికే చెల్లింది.