Begin typing your search above and press return to search.
5 కోట్ల మందిని చంపిన స్పానిష్ ఫ్లూ ఎలా తగ్గింది?
By: Tupaki Desk | 12 May 2020 10:00 PM ISTఈ ప్రపంచాన్ని వందేండ్లకోసారి ఒక భయంకర ఫ్లూ మహమ్మారి కబళిస్తోంది. మనుషుల ప్రాణాలను పట్టిపీడిస్తోంది. ఇప్పటికే స్వైన్ ఫ్లూతో వందలాది ప్రాణాలు పోతుండగా.. తాజాగా చైనాలో పుట్టిన కరోనా వైరస్ కారణంగా చాలా మంది అసువులు బాస్తున్నారు.
1918లో ప్రపంచవ్యాప్తంగా ఐదు కోట్ల మందిని స్పానిష్ ఫ్లూ బలితీసుకుంది. స్పానిష్ ఫ్లూ సోకిన దాదాపు 20 మిలియన్ల నుంచి 50 మిలియన్ల మందిని నాడు చంపేశారని టాక్ ఉంది. దాదాపు 6,75,000 మంది అమెరికన్లు ఈ చనిపోయిన వారిలో ఉన్నారు. వ్యాధిని అరికట్టడానికి ప్రపంచాన్ని బతికించడానికి మందులేని ఈ వ్యాధి నుంచి ఇలా మనుషుల ప్రాణాలు తీశారనే అపవాదు ప్రచారంలో ఉంది. దీనిపై అధికారికంగా మాత్రం సమాచారం లేదు.
స్పానిష్ ఫ్లూ ఎక్కువగా 20-30 ఏళ్ల మధ్య వయసున్న వాళ్లకు మాత్రమే వచ్చింది. ఆ వయసు వాళ్లకు రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది. అప్పుడు మొదటి ప్రపంచ యుద్ధంలో దేశాలు ఉండగా.. ఈ ఫ్లూను దేశాలు పట్టించుకోలేదు. దీంతో అపార ప్రాణ నష్టం సంభవించింది. ఈ ప్లూ కార్చిచ్చులా అందరికీ సోకింది. ఫ్యాక్టరీలు, బస్సులు, రైళ్లలో ప్రయాణికులకు ఎక్కువగా వ్యాపించింది. దీంతో అందరినీ ఇళ్లలోనే క్వారంటైన్ లో ఉండాలని ఆనాడు ప్రభుత్వాలు ఆదేశించాయి.
1918లో ఈ స్పానిష్ ఫ్లూ కు మందులు లేవు.చికిత్స చేయడానికి ఏలాంటి పరికరాలు లేవు. యాంటి బయాటిక్స్ కూడా లేవు. దీంతో వేలమంది చనిపోయారు. ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. సర్వం లాక్ డౌన్ లాగా నాడు బంద్ అయిపోయాయి. తుమ్ములు, దగ్గుల ద్వారా ఈ వ్యాధి ఒకరినుంచి మరొకరికి వ్యాపిస్తుందని ప్రభుత్వం ప్రచారం చేసింది. సబ్సుతో ముక్కు కడుక్కోవాలని సూచించింది.
బ్రిటన్ దేశంలో 2.28 లక్షలమంది చనిపోయారు. జనాభాలో పావుశాతం మందికి ఈ వైరస్ సోకింది. చివరకు నేటి లాగా ప్రజలు క్వారంటైన్ ఉండి.. మాస్కులు, పరిశుభ్రత పాటించి చాలా మంది చనిపోయాక సామాజిక దూరం నిబంధలు నాడు పాటించడం వల్ల ఆ వైరస్ అంతర్థానమైంది. నేడు కరోనా కూడా అదే స్తాయిలో ఉంది. అప్పటి సీన్లే రిపీట్ అవుతున్నాయి. దీంతో నాటి వలే పరిశుభ్రతతోనే ఈ వైరస్ ను అరికట్టడం సాధ్యం అవుతుంది.