Begin typing your search above and press return to search.

మనుషులు ముద్దు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?

By:  Tupaki Desk   |   23 Aug 2021 4:23 AM GMT
మనుషులు ముద్దు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?
X
లిప్ టు లిప్ కిస్ అనేది ప్రేమకు చిహ్నం, అదొక అందమైన భావన.. ముద్దు పెట్టుకోవడం అనేది కామన్. ప్రపంచవ్యాప్తంగా 168 రకాల సంస్కృతుల్లో సగానికంటే తక్కువ సమాజాల్లో మాత్రమే పెదవులతో మాట్లాడుతారని ఓ పరిశోధనలో వెల్లడైంది.

శృంగారానికి ఈ లిప్ టు లిప్ కిస్ ఎంతో కీలకం.. 46శాతం మంది మాత్రమే పెదవులతో పెదవులకు చుంబనం ఇస్తారని లాస్వెగాస్ లోని నెవాడా యూనివర్సిటీ ఆంథ్రపాలజీ ప్రొఫెసర్ విలియం జన్మోనిక్ వెల్లడించారు.

ఇక హిందువుల వేదాల్లో అధర చుంబనం ప్రాముఖ్యత గురించి 3500 ఏళ్ల కిందటే వర్ణించారు. అసలు ముద్దు పెట్టుకోవాలనే ఆలోచన మనుషుల్లో ఎప్పటి నుంచి మొదలైందో చెప్పడానికి రెండు రకాల సిద్ధాంతాలున్నాయి.

నిజానికి మనుషులకు ముద్దు పెట్టుకోవాలనే కోరిక అనేది చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే సహజంగా కలుగుతుందని తేలింది. మొదటి దాని ప్రకారం పుట్టిన బిడ్డ తన పెదవులతో చనుబాలను తీసుకుంటుంది. అలా తల్లి స్థనాన్ని తాకడానికి ముద్దుకు మధ్య అంతర్లీన సంబంధం ఉండొచ్చు. ఈ భావన ప్రతి ఒక్కరూ అనుభవించేదే.

ముద్దు ఎలాంటిదైనా నిజమైన అనుభూతిని అస్వాదించాలంటే సున్నిత భావాలను ఒకరికొకరు పంచుకోవడం ద్వారా మాత్రమే సాధ్యం. పెదవులపై పెదవులను అదిమిపెట్టి చుంబనం ఇవ్వడం కేవలం మానవ జాతికి మాత్రమే ఉన్న ప్రత్యేక లక్షణంగా చెప్పొచ్చు.