Begin typing your search above and press return to search.

పవన్ని జీవిత కలిశారా... ?

By:  Tupaki Desk   |   15 Sept 2022 9:39 PM IST
పవన్ని జీవిత కలిశారా... ?
X
సీనియర్ నటి జీవితా రాజశేఖర్ రాజకీయాల్లో చురుకుగా ఉండాలనుకుంటున్నారు. ఆమె చాలా ఏళ్ళుగా ఈ తరహా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఆమె ఇప్పటికే చాలా పార్టీలు మారారు. చాలా జెండాలు పట్టుకున్నారు. అయితే లేటెస్ట్ గా ఒక గాసిప్ అయితే వినిపిస్తోంది. అదేంటి అంటే జీవితా రాజశేఖర్ తాజాగా పవన్ని కలిశారు అని. పావుగంట పాటు ఆయనతో చర్చించారు అని.

ఒక విధంగా ఇది పుకారుగా ఉన్న ప్రచారంలో అయితే ఉంది. జీవిత పవన్ని ఎందుకు కలిశారు అన్నదే చర్చగా కూడా ఉంది. ఆమె ఇప్పటికే బీజేపీలో చేరిపోయారు. తెలంగాణాలో ఆమె బీజేపీ తరఫున పోటీ చేయాలని అనుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

అయితే బీజేపీకి మిత్రపక్షంగా జనసేన ఉంది. అది కూడా ఆంధ్రాలో ఈ బంధం ఉంది. తెలంగాణాలో ఎంతవరకూ ఈ రెండు పార్టీలు కలసి పోటీ చేస్తాయో తెలియదు. మరి ఈ టైం లో జీవిత పవన్ని ఎందుకు కలిశారు అన్నదే చర్చగా ఉంది. ఈ మధ్యనే బీజేపీలో చేరిన జీవిత జనసేనలో ఏమైనా చేరుతారా అన్న మాట కూడా వినిపిస్తోంది.

మరో వైపు చూస్తే జీవిత అంధ్రాకు చెందిన వారే. ఇక రాజశేఖర్ తమిళనాడుకు చెందిన నటుడు. అయితే దాంతో జీవిత కనుక ఏపీ నుంచి పోటీ చేయాలని చూస్తున్నారా అన్న డౌట్లు పుట్టుకువస్తున్నాయి. ఏపీలోని బలమైన సామాజికవర్గానికి చెందిన జీవిత తన భర్త నటుడు రాజశేఖర్ తమిళ మూలాలను ఆధారం చేసుకుని చిత్తూరు జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారా అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి.

ఏది ఏమైనా జీవితా రాజశేఖర్ జనసేనానితో భేటీ అయ్యారు అన్న వార్తలు అయితే జోరుగా వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ ఒకవేళ జీవిత కలిస్తే మాత్రం రాజకీయంగా కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన విషయమే అని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.