Begin typing your search above and press return to search.
భారత పౌరసత్వం కోసం పాకిస్థానీయుల ఆసక్తి.. అందుకోసమేనా?
By: Tupaki Desk | 24 Dec 2021 7:00 AM ISTభారత దేశ పౌరసత్వం కోసం వివిధ దేశాలకు చెందిన ప్రజలు పెద్ద మొత్తంలో దరఖాస్తులు చేసుకుంటున్నారు. ముఖ్యంగా మన దాయాది దేశం అయిన పాకిస్థాన్ నుంచి ఎక్కువ మంది అప్లై చేసినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. అయితే ఈ ఏడాది మాత్రం పెద్ద మొత్తంలో దరఖాస్తులు అందాయని పేర్కొంది. ఇలా భారీ సంఖ్యలో సిటిజన్ షిప్ కోసం అప్లికేషన్ లు అందడం ఇదే తొలిసారని వెల్లడించింది. ఇదిలా ఉంటే భారతదేశ పౌరసత్వం ఇచ్చేందుకు కేంద్ర హోం శాఖ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.
ఇప్పటికే వచ్చిన దరఖాస్తుల్లో సుమారు 70 శాతానికి పైగా అప్లికేషన్ల పై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. కొన్ని సంవత్సరాలుగా కేంద్రం సుమారు 3117 మందికి భారతదేశ పౌరసత్వాన్ని కల్పించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. వీరంతా మనకు పొరుగున ఉన్న పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ లాంటి దేశాలకు చెందిన వారే అని పార్లమెంటులో చెప్పింది.
అయితే డిసెంబర్ 14వ తేదీ వరకు సుమారుగా భారతదేశ పౌరసత్వం కోసం పది వేలకు పైగా దరఖాస్తులు అందినట్లు కేంద్రం లెక్కలు చెప్తున్నాయి. అయితే వీటిలో సింహభాగం పాకిస్థానీయులవే అని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. సుమారు 7306 మంది పాకిస్థానీయులు భారత పౌరసత్వం కోసం పోటీపడినట్లు స్పష్టం చేసింది.
ఇప్పటివరకూ భారత ప్రభుత్వానికి అందిన మొత్తం దరఖాస్తుల సంఖ్య ఎన్నో అని చెప్పాలని పార్లమెంటులో ఎంపీ అబ్దుల్ వాహబ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ లెక్కలను ఇచ్చింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పని చేస్తున్నటువంటి నిత్యానంద రాయి ఈ గణాంకాలను సభ ముందు ఉంచారు.
అయితే పాకిస్థాన్ నుంచి ఎక్కువ దరఖాస్తులు అందినట్లు మంత్రి చెప్పారు. వీటితోపాటు అఫ్గానిస్థాన్ నుంచి వెయ్యికి పైగా అప్లికేషన్లు వచ్చినట్లు వివరించారు మంత్రి. అంతేకాకుండా శ్రీలంక, బంగ్లాదేశ్, అమెరికా లాంటి ఇతర దేశాల నుంచి కూడా విరివిగా అప్లికేషన్స్ వచ్చాయని సభకు తెలిపారు. వీటితో పాటు చైనా నుంచి కూడా 10 దరఖాస్తులు కేంద్ర హోం శాఖకు అందాయని మంత్రి పేర్కొన్నారు.
మరో 10 లక్షల మంది భారత దేశ సిటిజన్ షిప్ నుంచి వైదొలిగినట్లు మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పింది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. నాలుగు సంవత్సరాల్లో సుమారు 8,244 మంది అప్లికేషన్లు వచ్చాయని తెలిపింది. వీటిలో కొన్నింటిని మాత్రమే స్కూట్నీ చేసినట్లు పేర్కొన్నారు అధికారులు. ఈ సంఖ్య 3117గా ఉంది.