Begin typing your search above and press return to search.

క్లాస్ రూమ్ లోనే పెళ్లి చేసుకున్న ఇంటర్ విద్యార్థులు .. ఎక్కడంటే ?

By:  Tupaki Desk   |   3 Dec 2020 2:15 PM IST
క్లాస్ రూమ్ లోనే పెళ్లి చేసుకున్న ఇంటర్ విద్యార్థులు .. ఎక్కడంటే ?
X
పెళ్లి అంటే ఏమనుకున్నారో తెలియదు కానీ , రెండు కుటుంబాల సమ్మతితో జరగాల్సిన పెళ్లిని చాలా సింపుల్ గా క్లాస్ రూమ్ లోనే కానిచ్చేశారు. ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరు మైనర్ విద్యార్థులు క్లాస్ రూమ్ లోనే పెళ్లి చేసుకున్న ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జూనియర్ కళాశాలలో జరిగింది.

ఈ ఘటన కి సంబంధించిన పూర్తి వివ‌రాల్లోకి వెళితే.. రాజమండ్రి ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల‌లో చ‌దువుతున్న ఓ మైన‌ర్ బాలిక‌, మైన‌ర్ బాలుడు క్లాస్ రూంనే పెళ్లి మండ‌పంగా మార్చేశారు. అమ్మాయి మెడ‌లో అబ్బాయి ఏకంగా మూడు ముళ్లు వేశాడు. ఆమె నుదిటిన బొట్టు పెట్టాడు. ఏదో ఘ‌న కార్యం చేసిన‌ట్లు మొబైల్‌ లో వీడియో కూడా రికార్డ్ చేశారు. ఆ వీడియో బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో ఆ కాలేజీ ప్రిన్సిపాల్ వారిద్దరికీ టీసీ ఇచ్చి పంపించేశాడు. అంత‌టితో ఈ వివాదం ముగియ‌లేదు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్ కావ‌డంతో ఆ పిల్ల‌ల త‌ల్లిదండ్రులు ఏం చేయాలో పాలుపోక త‌ల‌లు ప‌ట్టుకున్నారు. అయితే ఇది నిజమైన పెళ్లికాదని, సోషల్‌ మీడియాలో లైకుల కోసం మాత్రమే చేశామని విద్యార్థులు చెప్పినట్లు తెలుస్తుంది.