Begin typing your search above and press return to search.
మోడీ ఎఫెక్ట్.. జగన్‌పై తీవ్ర ఒత్తిడి.. ఏం చేస్తారు...!
By: Tupaki Desk | 20 Nov 2021 6:00 PM ISTకేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న సంచలన నిర్ణయం.. ఏపీ సీఎం జగన్‌పై తీవ్ర ప్రభావం చూపించనుందా? అత్యంత సంక్లిష్టమన సాగు చట్టాల విషయంలో దేశవ్యాప్తంగా పెల్లుబికిన వ్యతిరేకత నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. సదరు సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. త్వరలో జరగనున్నపార్లమెంటు సమావేశాల్లో సదరు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామన్నారు. నిజానికి ఈ చట్టాలపై ఎట్టి పరిస్థితిలోనూ వెనక్కి తగ్గేది లేదని.. మోడీనే స్వయంగా ప్రకటించారు. ఇక, మంత్రులు కూడా ఒకరివెంట ఒకరుగా.. సాగు చట్టాలను సమర్ధిస్తూ.. వచ్చారే తప్ప.. రైతులను ఎక్కడా.. సమర్ధించలేదు. ఈ క్రమంలో తీవ్ర వివాదం.. గత 9 మాసాలుగా జరుగుతోంది.
అయితే.. ఉరుములు లేని వానలా.. మోడీ.. ఒక్కసారిగా సదరు సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నారు. ఇదంతా కూడా రైతుల ఒత్తిడికి.. వారు చేస్తున్న ఉద్యమానికి మోడీ తలొగ్గబట్టే జరిగిందని.. రైతుల హవా మోడీని బాగానే తాకిందనే చర్చలు వస్తున్నాయి. ఇప్పుడు ఇదే తరహాలో.. ఏపీలోనూ సీఎం జగన్ దిగిరాక తప్పదనే అంచనాలు వస్తున్నాయి. గత 700 రోజులుగా రాజధాని అమరావతి కోసం.. రైతులు మహిళలు ఉద్యమిస్తున్నారు. ఎక్కడికక్కడ ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరికివారు.. ఉద్యమంలో కీలకంగా పాల్గొంటున్నారు. ప్రభుత్వం నుంచి ఎన్ని నిర్బంధాలు వచ్చినా.. మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నారు.
అయినప్పటికీ.. ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. అంతేకాదు.. రైతుల ఉద్యమాన్ని తక్కువ చేసే ప్రయ త్నం కూడా చేసిందనే వాదన ఉంది. అదేసమయంలో రైతులను పెయిడ్ ఆర్టిస్టులుగా కూడా వ్యాఖ్యానించారు. అయినప్పటికీ.. రాజధానిరైతులు.. పట్టువదలని విక్రమార్కుల మాదిరిగా తమ ఉద్యమాన్నికొనసాగిస్తున్నారు. తాజాగా వారు ఈ నెల 1 నుంచి న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట మహాపాదయాత్రను కూడా చేపడతున్నారు. దీనికి అన్ని గ్రామాలు, నగరాలు, పార్టీలకు అతీతంగా.. మద్దతు లభిస్తోంది.
మహోద్రుతంగా సాగుతున్న పాదయాత్ర.. ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ దిగివచ్చినట్టే.. అమరావతి విషయంలో రైతుల అభిప్రాయాలకు విలువ నిచ్చి.. జగన్ కూడాదిగి రాకతప్పదని అంటున్నారు. మెజారిటీ ప్రజాభిప్రాయమే ప్రజాస్వామ్యానికి గీటురాయి అనే సూత్రాన్ని మోడీ నిర్ణయం ప్రతిఫలించేలా చేసిందని అంటున్నారు.
వచ్చే నాలుగు నెల్లలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలోను.. ఇప్పటికే జరిగిన కొన్ని అసెంబ్లీ, పార్లమెంటు ఉప ఎన్నికల్లో.. బీజేపీ దెబ్బతిన్న దరిమిలా.. మోడీ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. ఏపీలోనూ.. వచ్చే ఎన్నికల్లో తిరిగి విజయం దక్కించుకోవాలంటే.. అత్యంత సున్నితమైన రాజధాని విషయంలో జగన్ కూడా దిగిరాక తప్పదని..రైతుల అభిప్రాయాలకు వారు చేసిన త్యాగాలకు విలువ ఇవ్వకతప్పదని అంటున్నారు పరిశీలకులు.