Begin typing your search above and press return to search.

పెంపుడు కుక్కలకూ బీమా పాలసీ!

By:  Tupaki Desk   |   27 Aug 2020 11:00 AM IST
పెంపుడు కుక్కలకూ బీమా పాలసీ!
X
మనుషుల ప్రాణాలకే ఈ కరోనా టైంలో గ్యారెంటీ లేదురా బాబూ అంటే కుక్కలకు పాలసీ ఎంట్రా బాబూ అని ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ కంపెనీ ప్రకటనపై నెటిజన్లు కామెంట్స్ మొదలుపెట్టారు.

ఈ కరోనా విపత్కాలంలో మనకున్న హెల్త్ ఇన్స్యూరెన్స్ ను కూడా ఆస్పత్రులు పరిగణలోకి తీసుకోకుండా డబ్బులు కడితేనే చికిత్స చేయిస్తున్నాయి. పైసా లేకుండా ఆక్సిజన్ పైపు కూడా ఇవ్వడం లేదు. మరి మనుషులకే దిక్కులేని పరిస్థితి ఉంటే పెంపుడు కుక్కల కోసం బీమా పాలసీని తెచ్చింది ఓ కార్పొరేట్ సంస్థ.

పెంపుడు కుక్కల కోసం తాజాగా బజాజ్ అలియాంజ్ బీమా పాలసీని ప్రవేశపెట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘బజాజ్ అలియాంజ్ పెట్ డాగ్ ఇన్సూరెన్స్ ’ పాలసీ పేరుతో దీన్ని తీసుకురాగా.. పాలసీలో ప్రాథమిక కవరేజీలో సర్జరీ, ఆస్పత్రికి అయ్యే ఖర్చులు కవర్ అవుతాయి. జీఎస్టీ కాకుండా ప్రీమియం రూ.315తో మొదలవుతుందని బజాజ్ తెలిపింది.

ఈ పాలసీ 3 నెలల నుంచి 10 ఏళ్ల వయసు ఉన్న పెంపుడు కుక్కలకు మాత్రమే ఈ రాయితీ వర్తించనుందని మెలికపెట్టడం విశేషం.