Begin typing your search above and press return to search.

అజ‌య్ క‌ల్లంకు అవ‌మానం.. జ‌గ‌న్ స‌మ‌క్షంలోనే!?

By:  Tupaki Desk   |   21 Sep 2021 10:30 AM GMT
అజ‌య్ క‌ల్లంకు అవ‌మానం.. జ‌గ‌న్ స‌మ‌క్షంలోనే!?
X
ఏపీ స‌ర్కారు మాజీ సీఎస్‌.. ప్ర‌స్తుత స‌ల‌హాదారు.. అజ‌య్ క‌ల్లంకు తీవ్ర అవ‌మానం జ‌రిగిందా? ముఖ్య‌మం త్రి జ‌గ‌న్ స‌మ‌క్షంలోనే ఆయ‌న‌ను అవ‌మానించారా? అంటే.. తాజాగా జ‌రిగిన ఓ సంఘ‌ట‌నతో ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మకంగా భావిస్తున్న వాణిజ్య ఉత్సవ్‌ను సీఎం జ‌గ‌న్ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మం ద్వారా.. ఎగుమ‌తులను ప్రోత్స‌హిచడ‌మే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని సీఎం చెప్పారు. విజ‌య‌వాడ‌లో ప్రారంభ‌మైన ఈ కార్య‌క్ర‌మం మొత్తం మూడు రోజులు జ‌ర‌గ‌నుంది.

ఇక‌, ఈ కార్య‌క్ర‌మానికి దేశ విదేశాల నుంచి చాలా మంది కార్పొరేట్ దిగ్గ‌జాల‌ను ఆహ్వానించారు. చౌకగా ఎగుమతుల నిర్వహణకు రాష్ట్రంలో ఉ న్న అవకాశాలను అంతర్జాతీయ ఎగుమతిదారులకు వివరించడ మే వాణిజ్య ఉత్సవ్‌ లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. కేంద్ర సహకారంతో ట్రేడ్ ఎక్స్‌పోర్ట్ కార్నివాల్‌ పేరిట వాణిజ్య ఉత్సవ్ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్లాస్టిక్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌ 75 ఏళ్ల ఉత్సవం సందర్భంగా వాణిజ్య ఉత్సవ్ కార్యక్రమం నిర్వహిస్తున్న‌ట్టు ప్ర‌భుత్వం తెలిపింది.

అయితే.. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌భుత్వం త‌ర‌ఫున ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ హాజ‌రై ప్రారంభించారు. అయితే.. ఇదే కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన ముఖ్య స‌ల‌హాదారు.. సీనియ‌ర్ ఐఏఎస్ అదికారి అజ‌య్ క‌ల్లంకు అవ‌మానం జ‌రిగింది. ప్రొటోకాల్ కూడా పాటించకుండా.. ఆయన్ను వెనుక వరుసలో కూర్చోబెట్టారు. దీంతో ఆయన తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలిసింది. అనంతరం స్టేజ్‌పైకి పిలిచినా వెళ్లలేదని సమాచారం. ప్రోటోకా ల్ ప్రకారం మంత్రి స్థాయి(కేబినెట్‌) హోదా ఉన్నా.. అజయ్ కల్లంకు ఆ మేరకు గౌరవం ఇవ్వలేదు. పరిశ్రమల శాఖల అధికారుల వైఖరితో ముఖ్యులకు కేటాయించిన వరుసలో ఖాళీ ఉన్న వెనుక వరుసలో కూర్చున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ , మంత్రులు , ఉన్నతాధికారులు హాజరైన సదస్సులో కూడా అజయ్ కల్లం వెనుక వరుసలో కూర్చోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వాస్త‌వానికి ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత హైద‌రాబాద్‌కు వెళ్లిపోయిన‌.. అజ‌య్ ను సీఎం జ‌గ‌న్ స్వ‌యంగా ఆహ్వానించి.. స‌ల‌హాదారు ప‌ద‌విని అప్ప‌గించారు. అయితే.. ఆయ‌న‌కు స‌రైన గౌర‌వం ల‌భించ‌డం లేద‌ని.. కొన్నాళ్లుగా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అంతేకాదు.. ఆ మ‌ధ్య ఆయ‌న చూస్తున్న శాఖ‌ల‌కు సంబంధించిన స‌బ్జెక్టుల‌ను కూడా తొలిగించార‌ని.. వార్త‌లు వ‌చ్చాయి. అంటే.. అజ‌య్ క‌ల్లంకు అవ‌మానాలు ఇప్పుడు కొత్త‌కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.