Begin typing your search above and press return to search.

వాలంటీర్లు ఎన్నికల ప్రచారం చేయద్దని ఆదేశాలు

By:  Tupaki Desk   |   13 Nov 2021 4:55 AM GMT
వాలంటీర్లు ఎన్నికల ప్రచారం చేయద్దని ఆదేశాలు
X
ఏపీ వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం తీసుకుంటూ రాజకీయ పార్టీల తరుఫున ప్రచారం చేయవద్దని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

గ్రామ పంచాయతీలకు నవంబర్ 14న, పట్టణ స్థానిక సంస్థల్లో నవంబర్ 15న, ఎంపీటీసీ, జడ్పీటీసీలకు నవంబర్ 16న పోలింగ్ జరుగనుంది..

గతంలోనూ ఎస్ఈసీ నిమ్మగడ్డ ఇలానే వలంటీర్లను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల సందర్భంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికల ప్రక్రియలో వలంటీర్లను దూరంగా ఉంచాలని ఆదేశించారు.

ఎన్నికల ప్రక్రియలో గ్రామ వలంటీర్లను ఎన్నికలకు ప్రక్రియకు దూరంగా ఉంచాలని.. గ్రామ వలంటీర్లను అధికార వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచారం కోసం వాడటమే కాకుండా వారి ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

తాజాగా కూడా ఎస్ఈసీ వలంటీర్లను ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగానే గుర్తిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.