Begin typing your search above and press return to search.

యూజర్స్ కి భారీ షాక్ ఇచ్చిన ఇన్ స్టాగ్రామ్ ... ఏంటంటే ?

By:  Tupaki Desk   |   15 Sep 2020 10:50 AM GMT
యూజర్స్ కి భారీ షాక్ ఇచ్చిన ఇన్ స్టాగ్రామ్ ... ఏంటంటే ?
X
ప్రముఖ సోషల్ మీడియా యాప్‌ ఇన్ ‌స్టాగ్రామ్ తమ యూజర్స్ ‌కి భారీ షాక్ ఇవ్వబోతుంది. ఇన్ స్టాగ్రామ్ యూజర్స్ కి ఎలా షాక్ ఇస్తుంది అని అనుకుంటున్నారా? ఇక మీదట ఫొటోతో పాటు క్యాప్షన్ ఇస్తూ దాంట్లో యుఆర్ ‌ఎల్‌ పోస్ట్‌ చేయాలంటే యూజర్స్‌ ఇన్ ‌స్టాగ్రాంకు కొంత ఫీజు చెల్లించాలట. దీనికోసం ఇన్ ‌స్టాగ్రామ్ మాతృ సంస్థ ఫేస్ ‌బుక్‌ దీనికి సంబంధించిన పేటెంట్ కోసం దరఖాస్తు చేసినట్లు టెక్‌ వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై యూజర్స్‌ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 10 వేలకు పైన ఫాలోవర్స్‌ కలిగిన యూజర్స్ లేదా వెరిఫైడ్ యూజర్స్ ‌కి మాత్రమే ఉచితంగా యూఆర్‌ఎల్‌ లింక్‌ లను పోస్ట్ చేసే అనుమతి ఉండేది. తాజా నిర్ణయంతో ఫొటో క్యాప్షన్‌ తో పాటు క్లిక్‌ చేస్తే ఓపెన్‌ అయ్యేలా యూఆర్‌ ఎల్ లింక్‌ పోస్ట్‌ చేయాలంటే మాత్రం యూజర్‌ 2 డాలర్ల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

దీని వల్ల ఫీజు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నవారెవరైనా తమ కంటెంట్ ప్రమోట్ చేసుకునే వీలు ఉంది. ఒక వేళ యూజర్‌ ఫీజు చెల్లించకుండా యూఆర్ ‌ఎల్ లింక్‌ పోస్ట్‌ చేస్తే ఇన్‌ స్టాగ్రామ్ ఆటోమేటిగ్గా దాన్ని గుర్తించి లింక్‌ ను తొలగిస్తుంది. అయితే, ఇది వ్యాపార పరంగా తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకోవాలనుకునే వారికి మాత్రమేనని, సాధారణ యూజర్స్ ‌కి ఇది వర్తించకపోవచ్చని టెక్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ ఫీచర్‌ ఎప్పటి నుంచి అమలులోకి రాబోతుందనే దానిపై మాత్రం కంపెనీ నుంచి స్పష్టమైన సమాచారం లేదు. ఈ కొత్త విధానం వల్ల అడ్వటైజర్‌ అనుమతి లేకుండా ఇతరులు వారి కంటెంట్‌ ను ఉపయోగించకుండా నిరోధిస్తుందని, అనవసరమైన లింక్స్‌ పోస్టింగ్ ‌ను కట్టడి చేయవచ్చని ఇన్‌ స్టాగ్రామ్ భావిస్తోంది.