Begin typing your search above and press return to search.
రెడీ 1.. 2.. 3.. స్టార్టప్
By: Tupaki Desk | 20 Jan 2016 11:00 PM ISTప్రధాని మోడీ కలల కార్యక్రమం స్టార్టప్ ఇండియా కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైంది. 30 పేజీల ఈ ప్రణాళిక వేలాదిగా స్టార్టప్ సంస్థలను ఏర్పాటు చేయడానికి తోడ్పడడమే కాకుండా దేశ ఆర్థిక వృద్ధికి కూడా ఊతమిచ్చేలా మార్చేందుకు సహాయపడబోతోంది. స్టార్టప్ ఇండియా యాక్షన్ ప్లాన్ భారత దేశ ఆర్థిక ప్రగతిని పరుగులు తీయిస్తుందని... సంపద సృష్టికి కారణమవుతుందని... నిరుద్యోగితకు కొత్త పరిష్కారంగా మారుతుందని ఆర్థిక - పారిశ్రామిక నిపుణులు భావిస్తున్నారు.
స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని పరుగులు తీయించడానికి, సరళం చేయడానికి వీలు కల్పిస్తూ విడుదల చేసిన కార్యాచరణ ప్రణాళికలో అనేక కీలకాంశాలున్నాయి.
- ఏప్రిల్ 1న స్టార్టప్ ఇండియా కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ ను విడుదల చేయబోతున్నారు. ఈ యాప్ సహాయంతో స్టార్టప్ ల రిజిస్ట్రేషన్ వంటివి సులభం కానున్నాయి.
- కొత్తగా పురుడు పోసుకునే సంస్థలకు అండగా నిలిచి వ్యాపారపరంగానిలదొక్కుకునేలా చేయడానికి అటల్ ఇన్నొవేషన్ మిషన్ ను ప్రధాని ప్రకటించారు. శిక్షణ - వ్యాపారా మెలకువలు వంటి తోడ్పాటులకు ఇది వేదిక కానుంది.
- స్టార్టప్ సంస్థలు పర్యావరణ - కార్మిక చట్టాలకు సంబంధించి సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది. మూడేళ్ల వరకు ఈ విషయాల్లో వీటిపై తనిఖీలు ఉండవు.
- పేటెంట్ వంటివాటికి సంబంధించి ప్రభుత్వపరంగా స్టార్టప్ లకు న్యాయసహాయం అందుతుంది.
- స్టార్టప్ ల రిజిస్ట్రేషన్ కు సంబంధించి నిబంధనలు సులభతరం చేసింది ప్రభుత్వం. ఒకవేళ స్టార్టప్ విఫలమైతే 90 రోజుల్లో సంస్థను మూసివేసే వెసులుబాటు కల్పిస్తున్నారు.
- స్టార్టప్ ల అభివృద్ధి కోసం 10 వేల కోట్ల రూపాయల నిధిని ఏర్పాటుచేస్తున్నారు.
- వీటికి ప్రోత్సాహం అందించే ఉద్దేశంతో మూడేళ్ల వరకు ఆదాయపు పన్ను మినహాయిస్తున్నారు.
- స్టార్టప్ ల ఊపు కొనసాగించేందుకు గాను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో స్టార్టప్ ఫెస్టు ఏర్పాటుచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.