Begin typing your search above and press return to search.

సూదిగాడా..? సూదిగాళ్లా..?

By:  Tupaki Desk   |   31 Aug 2015 4:07 AM GMT
సూదిగాడా..? సూదిగాళ్లా..?
X
సూదిగాడి కలకం కొనసాగుతోంది. అంతుచిక్కని రీతిలో ఇంజెక్షన్ సూదిగా దాడి చేస్తూ.. తప్పించుకుంటున్న సూదిగాడు?) మరోసారి రెచ్చిపోయాడు. సూదిగాడి దెబ్బకు ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్న పోలీసులు.. తాజాగా చోటు చేసుకున్న ఉదంతంతో మరింత కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే.. ఇప్పటివరకూ ఇంజెక్షన్ల తో దాడికి పాల్పడేది ఒకరే అనుకుంటుంటే.. అందుకు భిన్నంగా ఇద్దరు కలిసి.. తాజాగా దాడికి పాల్పడటం కలకలం రేపుతోంది.

ఆదివారం రాత్రి పశ్చిమగోదావరి జిల్లా మండల కేంద్రం పెంటపాడు సెంటర్ లో సూదిగాళ్లు ఒక వ్యక్తిగా దాడి చేయటంతో.. ఇంతకాలం సూదిగాడు ఒకడు కాకుండా.. ఇద్దరా? అన్న కొత్త సందేహాలు కలిగేలా తాజా ఉదంతం చోటు చేసుకోవటం గమనార్హం.

పశ్చిమగోదావరి జిల్లా మండల కేంద్రమైన పెంటపాడు సెంటర్ లో జడ్లపాలెం గ్రామానికి చెందిన బ్రహ్మం అనే వ్యక్తిని బైక్ మీద వచ్చిన ఇద్దరు దుండగులు.. రెండు చోట్ల సూదిపోటు పొడిచి పరారయ్యారు. తాజాగా సూదిపోటుకు గురైన బ్రహ్మం మద్యం మత్తులో ఉన్నాడు. తనపై సూదిదాడి జరిగిందని ఇంటికి వెళ్లి భార్యకు చెప్పాడు. అతడ్ని 108లో తరలించిన కుటుంబ సభ్యులు.. ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇతగాడిపై సూదిపోటు జరిగిందా? లేదా? అన్నది ఒక ప్రశ్న అయితే.. ఇంతకాలం సూదిగాడు ఒకడేనని భావించిన వారికి భిన్నంగా.. ఇద్దరున్నారన్న సందేహం కలిగేలా తాజా ఘటన చోటు చేసుకోవటం మరిన్ని చిక్కుముడులు పడేలా చేసింది.